న‌టుడు సోనూసూద్ రూ.20 కోట్ల మేర ప‌న్నులు ఎగ్గొట్టారు: ఇన్‌క‌మ్ ట్యాక్స్ విభాగం

September 18, 2021 4:11 PM

న‌టుడు, సంఘ సేవ‌కుడు సోనూ సూద్‌కు చెందిన ఇళ్ల‌లో, కార్యాల‌యాల్లో గ‌త 3 రోజులుగా ఇన్‌క‌మ్‌ట్యాక్స్ విభాగం అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. ముంబైతోపాటు లక్నోలో ఉన్న ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే శ‌నివారం ఆదాయపు ప‌న్ను విభాగం అధికారులు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. న‌టుడు సోనూసూద్ రూ.20 కోట్ల మేర ప‌న్ను ఎగ్గొట్టార‌ని తెలిపారు. దీంతో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

న‌టుడు సోనూసూద్ రూ.20 కోట్ల మేర ప‌న్నులు ఎగ్గొట్టారు: ఇన్‌క‌మ్ ట్యాక్స్ విభాగం

క‌రోనా నేప‌థ్యంలో సోనూసూద్ ఎంతో మందిని ఆదుకున్నారు. ఒక సంఘ సేవ‌కుడిగా ఆయ‌న‌కు మ‌ర్యాద ఇస్తాం. కానీ ఆయ‌న ప‌న్ను ఎగ్గొట్టారు. అందువ‌ల్ల చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకోక త‌ప్ప‌దు.. అని అధికారులు తెలిపారు.

కాగా గ‌తేడాది జూలైలో కోవిడ్ బాధితుల‌కు స‌హాయం అందించేందుకు గాను సోనూ సూద్.. త‌న పేరిట చారిటీ ఫౌండేష‌న్‌ను ఏర్పాటు చేశారు. దానికి రూ.18 కోట్ల మేర విరాళాలు రాగా అందులో రూ.1.9 కోట్ల‌ను స‌హాయం కోసం ఖ‌ర్చు పెట్టారు. మిగిలిన మొత్తం బ్యాంకు అకౌంట్ల‌లో అలాగే ఉంద‌ని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి విరాళాలు తీసుకునే విష‌యంలోనూ సోనూసూద్ ఫౌండేష‌న్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించింద‌ని ఇన్‌క‌మ్ ట్యాక్స్ విభాగం అధికారులు తెలిపారు.

ఇక ల‌క్నోలో ఉన్న ఓ కంపెనీ ద్వారా సోనూ సూద్ రూ.20 కోట్ల మేర లోన్లు తీసుకున్న‌ట్లు బోగ‌స్ ప‌త్రాల‌ను సృష్టించార‌ని, ఆ లోన్లు బోగ‌స్ అని, లోన్లు తీసుకున్న‌ట్లు 20 ఎంట్రీలు ఉన్నాయ‌ని, కానీ అవ‌న్నీ ఫేక్ అని అధికారులు తెలిపారు. అందువ‌ల్ల సోనూసూద్ రూ.20 కోట్ల మేర ప‌న్నుల‌ను ఎగ్గొట్టిన‌ట్లు గుర్తించామ‌ని అధికారులు తెలియ‌జేశారు.

అయితే సోనూసూద్ ఇళ్లు, ఆఫీసుల‌పై ఐటీ శాఖ దాడులు చేయ‌డంపై శివ‌సేన‌, ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు బీజేపీని విమ‌ర్శిస్తున్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వానికి సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అయినందునే ఆయ‌న ఇళ్లు, కార్యాల‌యాల‌పై ఐటీ శాఖ దాడులు చేస్తుంద‌ని వారు ఆరోపించారు. కానీ బీజేపీ నేతలు ఈ విష‌యాన్ని కొట్టి పారేస్తున్నారు. సోనూసూద్ బ్రాండ్ అంబాసిడ‌ర్ కావడానికి, ఆయ‌న ఇళ్ల‌పై ఐటీ దాడులు జ‌ర‌గ‌డానికి సంబంధం లేద‌ని అంటున్నారు. కాగా ఈ విష‌యం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now