భారతదేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్నటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ విషయంలో సీరం ఇన్‌స్టిట్యూట్ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోసు ప్రభుత్వానికి రూ.400 ల ధర నిర్ణయించగా, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.600 నిర్ణయించినట్లు ఇదివరకే ప్రకటించింది.
తాజాగా సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా టీకా ధరల విషయంలో 25% తగ్గిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి అందిస్తున్న ఒక్కో డోసును రూ.400కు విక్రయిస్తుండగా.. ఆ ధరను రూ.300కు తగ్గిస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో బుధవారం సాయంత్రం ట్వీట్ చేశారు. తగ్గించిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న ఈ విపత్కరమైన పరిస్థితులలో సీరం ఇన్‌స్టిట్యూట్ మానవతా దృక్పథంతో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్రాలకు కొన్ని వేల కోట్లలో ఆదాయం లభిస్తుందని, మరికొంతమందికి వ్యాక్సిన్ అందించడానికి వెసులుబాటు ఉంటుందని అదర్ పూనావాలా వెల్లడించారు. అయితే కేవలం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాలకు మాత్రమే ఈ ధరలను తగ్గించినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా పేర్కొన్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…