దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది.ఈ క్రమంలోనే రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు సంభవించడంతో ప్రజలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే గుజరాత్ లో కరోనా కేసులు భారీగా పెరగడంతో కరోనా కట్టడి చర్యలలో భాగంగా అక్కడి ప్రభుత్వం భారతదేశ అపరకుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సహాయం కోరింది.
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ముఖేష్ అంబానీ సహాయం కోరగా అందుకు ముఖేష్ అంబానీ సానుకూలంగా స్పందించి వెయ్యి పడకలు కలిగిన కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటుకు కంపెనీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వీరు ఏర్పాటు చేయబోయే ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాతో సహా వెయ్యి పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ రిఫైనరీ ఉన్న జామ్‌నగర్‌లో ఈ భారీ కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఆదివారంలోగా 400 పడకలతో ఏర్పాటు చేస్తామని త్వరలోనే 1000 పడకలకు పెంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విపత్కర పరిస్థితులలో రిలయన్స్ అధినేత ఈ సహాయం చేయడం పట్ల అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…