కరోనాతో భర్తను కోల్పోయిన మహిళలకు రూ.2.5 లక్షలు.. కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం..

June 29, 2021 5:40 PM

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ ఎంతటి స్థాయిలో వ్యాపించి తీవ్ర ప్రళయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కుటుంబానికి అండగా ఉంటూ కుటుంబ పోషణను భరించే భర్త చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే. అలా ఎన్నో కుటుంబాలు తమ కుటుంబ పెద్దను కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఈ విధమైనటువంటి విపత్కర పరిస్థితులలో అస్సాం ప్రభుత్వం భర్తను కోల్పోయిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

ఈ క్రమంలోనే అస్సాం ప్రభుత్వం కరోనా కారణం చేత భర్తను కోల్పోయిన మహిళల కోసం ‘ముఖ్యమంత్రి కోవిడ్-19 వితంతు సహాయ పథకం’ అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద భర్తను కోల్పోయిన మహిళలకి రూ.2.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ ప్రకటించారు.

ఈ విధమైనటువంటి పథకం కింద మహిళలు ఆర్థిక సహాయాన్ని పొందాలంటే కేవలం ఆ కుటుంబం వార్షిక ఆదాయం 5 లక్షల లోపు మాత్రమే ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా యధావిధిగా వారికి వితంతు పెన్షన్ కూడా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది విలువైన ప్రాణాలను కోల్పోయి అనేక కుటుంబాలలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఈ వైరస్ కారణంగా భర్తని కోల్పోయిన మహిళలకు ఉపశమనం కలిగించడం కోసమే ఈ విధమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు

ఈ విధమైనటువంటి ఆర్థిక సహాయాన్ని పొందాలనుకునే వారు తమ భర్త కరోనా కారణం వల్ల చనిపోయారని రాష్ట్రస్థాయి కోవిడ్ మరణాలు ఆడిట్ బోర్డు ధ్రువీకరించాల్సి ఉంటుంది.అలాగే, కుటుంబం వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలని, కోవిడ్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వారి భార్యలకు ఈ పథకం వర్తించదని ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now