సాధారణంగా రైలు పట్టాలు దాటడం చట్టపరంగా నేరం అనే విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా రైలు పట్టాలు దాటడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు తలెత్తవచ్చు. ఈ క్రమంలోనే ఓ 70 ఏళ్ల వృద్ధుడు రైలు పట్టాలను దాటుతూ ప్రమాదం అంచున వరకు వెళ్లి తిరిగి వచ్చాడు. కేవలం లోకో పైలెట్ల సమయస్ఫూర్తితో వృద్ధుడు బతికి బట్ట కట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ముంబై సమీపంలోని కళ్యాణ్ స్టేషన్ ఫ్లాట్ ఫారం నంబర్ 4 సమీపంలో మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో ఒక వృద్ధుడు పట్టాలు దాటుతుండగా ఆకస్మికంగా పట్టాలపై పడిపోయాడు. ఇది గమనించిన చీఫ్ పర్మనెంట్ వే ఇన్ స్పెక్టర్ సంతోష్ కుమార్, లోకో పైలట్లు ఎస్ కె ప్రధాన్, అసిస్టెంట్ లోకో పైలట్ జీ. రవిశంకర్ లను హెచ్చరికలను జారీ చేస్తూ వృద్ధుడికి తెలిసే విధంగా హెచ్చరికలు చేయాలని తెలిపారు. అయితే ఆ హెచ్చరికలను కాదని లోకో పైలెట్లు ఇద్దరూ అత్యవసర బ్రేకులు వేసే ఆ వృద్ధుడిని కాపాడారు.
అత్యవసర బ్రేకులు వేసి రైలు ఆపిన ఇద్దరు పైలెట్లు తరువాత రైలు కింద పడిన వృద్ధుడిని సురక్షితంగా బయటకు తీశారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈక్రమంలోనే లోకో పైలెట్లు సమయస్ఫూర్తిని ఉపయోగించి 70 ఏళ్ల వృద్ధుడిని చావు నుంచి కాపాడారని లోకో పైలెట్ల పై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా సీపీడబ్ల్యుఐకి సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అలోక్ కన్సల్ ఇద్దరు లోకో పైలెట్లకు రెండు వేల రూపాయలు నగదు బహూకరించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…