బంపర్ ఆఫర్: ఆక్సిజన్,రెమిడిసివిర్ బ్లాక్ మార్కెట్ గుట్టు చెబితే..భారీ నజరానా!

April 30, 2021 2:02 PM

భారత దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆస్పత్రి చేరే వారి సంఖ్య అధికం అయ్యింది. ఆస్పత్రిలో సరైన ఆక్సిజన్, యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆక్సిజన్, రెమిడిసివిర్ వంటి వాటికి బాగా డిమాండ్ పెరగడంతో వీటిని అదునుగా చేసుకొని కొందరు పెద్ద ఎత్తున దందాలు నిర్వహిస్తున్నారు.

ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడిసివిర్ ఇంజక్షన్ల డిమాండ్ పెరగడంతో వీటిని బ్లాక్ మార్కెట్ కి తరలించి అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము పోగు చేస్తున్నారు.వీటి ద్వారా బ్లాక్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోవడంతో వీటిని కట్టడి చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే చంఢీగఢ్‌లోని జలంధర్ అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

బయట బ్లాక్ మార్కెట్లో ఎక్కడైతే ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు,ఆర్టీపీసీఆర్ కిట్లు వంటి వాటిని ఎక్కడైతే బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారో వాటి సమాచారం తెలియజేసిన వారికి భారీగా నగదు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. స్టింగ్ ఆపరేషన్ చేసిన,సరైన ఆధారాలతో పట్టించిన వారికి పాతిక వేల రూపాయల నజరానా ఉంటుందని జలంధర్ అధికారులు ఈ ఆఫర్ ప్రకటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment