భార‌త‌దేశం

రూ.1000 కోట్లు పెట్టి ఇల్లు కొన్న డిమార్ట్ య‌జ‌మాని..!!

డిమార్ట్ సూప‌ర్ మార్కెట్‌ల గురించి తెలుసు క‌దా. బ‌య‌ట మార్కెట్ క‌న్నా త‌క్కువ ధ‌ర‌ల‌కే వ‌స్తువుల‌ను విక్ర‌యిస్తార‌ని వాటికి పేరుంది. ఆ సూప‌ర్ మార్కెట్‌ల య‌జ‌మాని రాధాకృష్ణ‌న్ ద‌మాని. అవెన్యూ సూప‌ర్ మార్ట్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఆయ‌న డిమార్ట్ సూప‌ర్ మార్కెట్‌లతో వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆయ‌న తాజాగా ముంబైలోని అత్యంత పాష్ ఏరియాలో భారీ మొత్తం వెచ్చించి ఓ ఇంటిని కొనుగోలు చేశారు.

ముంబైలోని మ‌ల‌బార్ హిల్ ఏరియాలో రాధాకృష్ణ ద‌మాని ఏకంగా రూ.1000 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారు. దాని విస్తీర్ణం 5,752.22 చ‌ద‌రపు అడుగులు. పూరాచంద్‌, ప‌రేష్‌చంద్‌, రాయ్‌చంద్‌, ప్రేమ్ చంద్ అనే వ్య‌క్తుల నుంచి ఆయ‌న ఆ ఇంటిని కొన్నారు. మార్చి 31వ తేదీన ఆయ‌న ఆ ఇంటిని కొన‌గా కేవ‌లం స్టాంపు డ్యూటీకే రూ.30 కోట్లు చెల్లించారు.

కాగా క‌రోనా స‌మ‌యంలో రాధాకృష్ణ‌న్ ఆస్తులు అమాంతం పెరిగాయి. 2020 ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ ప్ర‌కారం ఆయ‌న దేశంలో సంప‌న్నుల జాబితాలో 4వ స్థానంలో ఉన్నారు. ఆయ‌న ఆస్తి విలువ సుమారుగా 15.4 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా.

ముంబైలో క‌రోనా వ‌ల్ల గతేడాది రియ‌ల్ ఎస్టేట్ పూర్తిగా ప‌డిపోయిన‌ప్ప‌టికీ ఇటీవ‌లి కాలంలో ఆ రంగం 112 శాతం వృద్ధి రేటును సాధించింది. రియ‌ల్ ఎస్టేట్ అక్క‌డ మ‌ళ్లీ పుంజుకుంటోంది. అయితే 2015లో పూనావాలా గ్రూప్ చైర్మ‌న్ సైర‌స్ పూనావాలా అక్క‌డ ఉన్న లింకన్ హౌజ్‌ను ఏకంగా రూ.750 కోట్లు పెట్టి కొన‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM