పిల్లల ముందే దళిత మహిళపై అత్యాచారం… కేవలం ఆ కారణం వల్లే చిత్రహింసలు..

May 30, 2021 3:55 PM

తనకు ఆరోగ్యం బాగా లేదని తన యజమానికి చెప్పడమే తన పాలిట తన కుటుంబం పాలిట శాపంగా మారింది. తన యజమాని చెప్పిన పని నిరాకరించినందుకే కోపంతో యజమాని తన భార్య పిల్లలను కిడ్నాప్ చేసి భార్య పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్‌లో ఛతర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

ఛతర్పూర్ జిల్లాలో ఓ గ్రామంలోని భూస్వామి తన పొలంలో ఉన్న చెట్లను నరికి వేయడానికి దళిత కార్మికుడిని నియమించుకున్నాడు. అయితే అతనికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ పని చేయడానికి నిరాకరించాడు. పని ఒప్పుకొని చేయకపోవడంతో ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యజమాని ఆ దళితుడిపై వాగ్వాదానికి దిగాడు.ఈ క్రమంలోనే అతడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోగా అతని పై కోపం పెంచుకున్న యజమాని అతని ఇంటికి వెళ్లి తన భార్య పిల్లలు అతని తల్లిని కిడ్నాప్ చేయించాడు.

ఆ దళితుని భార్య గర్భవతి అని తెలిసినా కూడా ఏమాత్రం మానవత్వం లేకుండా ఆమెను కొట్టారు. నాలుగురోజుల పాటు వారిని బంధించిన యజమాని వారిని చిత్రహింసలకు గురిచేశారు.విషయం తెలిసిన జర్నలిస్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసుల సహాయంతో వారి ఆచూకీని తెలుసుకుని గాయపడిన వారిని సరైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి అరెస్టు చేసి అతనికి సహకరించిన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తాజాగా ఈ ఘటనపై బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేసింది.సదరు యజమాని తన కొట్టడమే కాకుండా పిల్లల ఎదురుగానే తనపై లైంగికంగా దాడి చేశారని, ఆ విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు అంటూ ఆరోపించింది. ఈ విషయంపై స్పందించిన పోలీసులు ఆమె కేవలం తనపై దాడి చేశారని, లైంగికంగా దాడి జరిగినట్లు తను పేర్కొనలేదని.. ఒకవేళ ఆమెపై లైంగికదాడి జరిగినట్టు చెబితే తప్పకుండా ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తామని ఛతర్పూర్ జిల్లా ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now