Crime News : ప్రస్తుత కాలంలో రోజు రోజుకూ అత్యాచార ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఏమాత్రం వావి వరసలు లేకుండా చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఆడది కనబడితే చాలు.. వారిపై కామాంధులు అత్యాచారానికి ప్రయత్నిస్తున్నారు. చివరికి కడుపున పుట్టిన కన్నకూతురిపై కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుండడంతో మనుషులలో మానవత్వం మంటగలిసి పోతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది.
తమిళనాడులోని విల్లుపురం జిల్లా కోవిల్‌పురాయూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ దివ్యాంగుడు. కొన్ని రోజుల క్రితం తన భార్యమరణించింది. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె ఒక వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. చిన్న కుమార్తె ఇంటర్ చదువుతోంది. తమిళనాడులో స్థానిక ఎన్నికలు జరగడంతో అందుకు నామినేషన్ వేసిన వెంకటేష్ ను కలవడం కోసం కొందరు బంధువులు వచ్చారు. అయితే అతని ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న అతన్ని చూసి షాక్ అయిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ముందుగా రాజకీయ హత్యగా భావించిన వీరు ఆ తర్వాత తన కన్న కూతురు హత్య చేసిందని తేలడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అసలు విషయం బయటపెట్టింది. తన తండ్రి తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతోనే ఆత్మరక్షణ కోసమే ఈ పని చేశానని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ హత్య కేసులో మరింత లోతుగా విచారణ జరపాలని జిల్లా ఎస్పీ శ్రీనాథ ఆదేశించారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…