ఆక్సిజ‌న్‌ను పీల్చి ఆక్సిజ‌న్‌ను వ‌దిలే ఏకైక జంతువు.. ఆవు.. అల‌హాబాద్ హైకోర్టు న్యాయ‌మూర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

September 5, 2021 3:38 PM

అల‌హాబాద్ హైకోర్టు న్యాయ‌మూర్తి శేఖ‌ర్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌లే ఆయ‌న ఆవును జాతీయ జంతువుగా ప్ర‌క‌టించాల‌ని అన్నారు. తాజాగా మ‌రోసారి ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. దీంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి. ఓ వ్య‌క్తికి సంబంధించిన కేసులో ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఆక్సిజ‌న్‌ను పీల్చి ఆక్సిజ‌న్‌ను వ‌దిలే ఏకైక జంతువు.. ఆవు.. అల‌హాబాద్ హైకోర్టు న్యాయ‌మూర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

సంభల్ జిల్లాకు చెందిన జావేద్ అనే వ్య‌క్తి బెయిల్ పిటిష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అత‌నిపై గోవ‌ధ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే అత‌ని పిటిష‌న్‌ను విచారించిన జ‌స్టిస్ శేఖ‌ర్ కుమార్ యాద‌వ్ అత‌నికి బెయిల్ నిరాక‌రించారు. జావేద్ గ‌తంలో ప‌లు మార్లు గోవుల‌ను వ‌ధించాడ‌ని, అత‌నికి బెయిల్ ఇస్తే బ‌య‌ట‌కు వచ్చాక అత‌ను మ‌ళ్లీ అదే ప‌నిచేస్తాడని, క‌నుక అత‌నికి బెయిల్ ఇవ్వ‌కూడ‌ద‌ని ప్ర‌తివాదులు కోరారు. ఇందుకు న్యాయ‌మూర్తి ఏకీభ‌వించారు. అంతేకాదు, ఆయన ఆవును జాతీయ జంతువుగా ప్ర‌క‌టించాల‌ని అన్నారు.

ప్ర‌పంచంలో ఆక్సిజ‌న్‌ను పీల్చి ఆక్సిజ‌న్‌ను వ‌దిలే ఏకైక జంతువు ఆవు అని జ‌స్టిస్ శేఖర్ కుమార్ యాద‌వ్ అన్నారు. దీన్ని సైంటిస్టులు కూడా నిర్దారిస్తార‌ని తెలిపారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ‌తో త‌యారు చేసే పంచ‌గ‌వ్యంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని, దాంతో అనేక వ్యాధులు న‌యం అవుతాయ‌ని అన్నారు. అందువ‌ల్ల ఆవును జాతీయ జంతువుగా ప్ర‌క‌టించాల‌ని అన్నారు. కాగా ఆయ‌న ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment