దేశంలో కోవిడ్ మూడో వేవ్ ఎప్పుడు వ‌స్తుంది ? ఐఐటీ రిపోర్ట్‌లో స‌మాధానం..!

June 22, 2021 10:18 AM

దేశంలో కోవిడ్ రెండో వేవ్ ప్ర‌భావం త‌గ్గుతున్న విష‌యం విదిత‌మే. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు రెండో వేవ్ పూర్తిగా అంత‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రోజువారీ కేసుల సంఖ్య 50వేల‌కు చేరుకుంది. అయితే కోవిడ్ మూడో వేవ్ ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. కానీ ఐఐటీ కాన్‌పూర్ బ‌య‌ట పెట్టిన నివేదిక ప్ర‌కారం కోవిడ్ మూడో వేవ్ ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యాన్ని వెల్ల‌డించారు.

covid 3rd wave may hit in october

దేశంలో కోవిడ్ మూడో వేవ్ సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్‌లో వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని ఐఐటీ కాన్‌పూర్‌కు చెందిన ప‌రిశోధ‌కులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. ఇప్ప‌టికే చాలా మంది నిపుణులు అక్టోబ‌ర్‌లో మూడో వేవ్ వ‌స్తుంద‌ని అంటున్నారు. దీనికి తోడు తాజా నివేదిక కూడా ఒక నెల అటు ఇటుగా అక్టోబ‌ర్ వ‌ర‌కు కోవిడ్ మూడో వేవ్ వ‌స్తుంద‌ని అంచ‌నా వేసింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ మూడో వేవ్ కచ్చితంగా వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

అయితే కొంద‌రు మాత్రం మ‌రో 4-5 వారాల్లోనే కోవిడ్ మూడో వేవ్ రావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. కానీ మెజారిటీ నిపుణులు మాత్రం అక్టోబ‌ర్‌లోనే మూడో వేవ్ వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా పిల్ల‌ల‌ను కోవిడ్ నుంచి ర‌క్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now