Life Tips : సాధారణంగా జంటలు పెళ్లికి ముందు ఒకరిపై ఒకరు చాలా ప్రేమ చూపించుకుంటారు. ఒకరి గురించి ఒకరు తలుచుకుంటూ వాళ్ల ధ్యాసలోనే గడిపేస్తుంటారు. నిజానికి ఒకరితో ప్రేమలో పడేది కూడా వాళ్లు మనపై చూపించే కేర్ ను చూసే. కానీ పెళ్లి తరువాత చాలా జంటలు తమ జీవిత భాగస్వాములు మారిపోయారంటూ గొడవలు పడుతుంటారు. కొంతమంది అయితే ఏకంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. అయితే అలా జరగకుండా ఉండాలన్నా.. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోవద్దని అనుకున్నా.. అందుకు కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది. నిపుణులు వీటిని చెబుతున్నారు. అవేమిటంటే..
ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఒకరికొకరు ప్రేమతో గుడ్ మార్నింగ్ లాంటివి చెప్పుకోవాలి. అంతేకాకుండా కలిసి టీ తాగడం, టిఫిన్ చేయడం లాంటివి చేయడంతో రోజు ప్రారంభమవుతుంది. అలా కలిసి ఉదయాన్నే టీ తాగుతూ ప్రశాంతంగా మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంది. భార్యాభర్తలు ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో కలిసి టీవీ చూడడం, సినిమాలు చూడటం లాంటివి చేయడం వల్ల ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడిపినట్టు అవుతుంది. దాని వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.
ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని అనిపించినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడం వల్ల బంధం బలపడుతుంది. భార్యకు భర్త ఇంటి పనుల్లో సాయం చేయడం, అదేవిధంగా భర్త ఆఫీసుకు వెళ్లే సమయంలో భార్య అతడి దుస్తులను ఇస్త్రీ చేయించడం లాంటివి చేయటం వల్ల ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ పెరుగుతుంది. ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడంతోపాటు ఒకరి ఇష్టాలను మరొకరు కాదనకపోవడం, కలసి బయటకు వెళ్లడం, సరదాగా విహరించడం.. వంటివి చేస్తే దంపతుల మధ్య కచ్చితంగా ప్రేమ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారని అంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…