Negative Energy : ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఉంటే ఇలా సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు..!

February 25, 2022 5:54 PM

Negative Energy : ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌కు స‌హ‌జంగానే ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఒక‌రిద్ద‌రికి స‌మ‌స్య‌లు ఉంటే ఓకే. కానీ కుటుంబం మొత్తానికి అనేక స‌మ‌స్య‌లు ఉంటే.. అప్పుడు ఆ ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఉన్న‌ట్లు అర్థం చేసుకోవాలి. ఇంట్లో వాస్తు దోషాలు, నెగెటివ్ ఎనర్జీ ఉంటే.. ఆ ఇంట్లోని వారంద‌రికీ ఏదో ఒక స‌మ‌స్య వ‌స్తూనే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆ దోషాల‌ను తొల‌గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అయితే ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఉంటే.. ఆ విష‌యం మ‌న‌కు ఎలా తెలుస్తుంది ? దాన్ని ఎలా గుర్తించాలి ? అంటే..

if you have Negative Energy in your home then find in this way
Negative Energy

ఉద‌యాన్నే లేచి స్నానపానాదులు ముగించుకుని దైవానికి పూజ చేయాలి. త‌రువాత రెండు లేదా నాలుగు గాజు గ్లాసుల‌ను తీసుకోవాలి. వాటిలో శుభ్ర‌మైన‌, స్వ‌చ్ఛ‌మైన నీటిని పోయండి. అనంత‌రం వాటిల్లో రెండు టీస్పూన్ల చొప్పున‌ స‌ముద్ర‌పు ఉప్పు (గళ్ల ఉప్పు) వేయండి. ఆ త‌రువాత ఆ గ్లాసుల‌ను ఇంట్లోని మూల‌ల్లో పెట్టండి. వాటి మీద మూత‌లు పెట్ట‌కండి.

అలా గాజు గ్లాసుల‌ను 24 గంట‌ల పాటు అలాగే ఉంచాలి. దీంతో వాటిల్లో ఉండే నీరు న‌ల్ల‌గా మారుతుంది. అలా జ‌రిగితే ఇంట్లో క‌చ్చితంగా నెగెటివ్ ఎన‌ర్జీ ఉన్న‌ట్లే భావించాలి. దీంతో ఆ ఎన‌ర్జీని పోగొట్టుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అవే గాజు గ్లాసుల‌ను వ‌రుస‌గా రోజూ అలాగే పెడుతుండాలి. దీంతో వారం లేదా ప‌ది రోజుల్లో నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది. దీంతో ఆ నీరు తెల్ల‌గా ఉంటుంది. అలా జ‌రిగితే ఇంట్లోని నెగెటివ్ ఎన‌ర్జీ పోయిన‌ట్లు లెక్క‌.

ఇక ఇంటి ప్ర‌ధాన ద్వారం మీద మ‌ధ్య‌లో స్వ‌స్తిక్ గుర్తును వేయాలి. అలాగే ద్వారం మీద ఓ బూడిద గుమ్మ‌డికాయ‌ను క‌ట్టాలి. దీంతోపాటు ఇంట్లో అక్వేరియంను పెట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దీంతో ఇంట్లోని వారంద‌రికీ స‌మ‌స్య‌లు పోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment