Huzurabad : ఉత్కంఠ‌కు తెర‌.. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ ఫ‌లితం వ‌చ్చేది ఎన్ని గంట‌ల‌కంటే..?

November 1, 2021 7:56 PM

Huzurabad : హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌కు స‌ర్వం సిద్ధం అయింది. నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగిన ప్ర‌చారం అనంత‌రం పోలింగ్ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలోక‌న్నా 2 శాతం ఎక్కువ‌గానే ఈ సారి హుజురాబాద్‌లో పోలింగ్ న‌మోదు అయింది. మొత్తం 86.33 పోలింగ్ శాతం న‌మోదైంది. దీంతో గెలుపు త‌మ‌దంటే త‌మ‌ది అంటూ.. అభ్య‌ర్థులు ఎవ‌రికి వారు ధీమాగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఉప ఎన్నిక ఫ‌లితంపై మ‌రికొద్ది గంటల్లో ఉత్కంఠ వీడ‌నుంది. 6 నెల‌ల నుంచి జ‌రిగిన రాజ‌కీయ పోరాటంలో గెలుపు ఎవ‌రిదో తేలిపోనుంది.

Huzurabad by election results on tuesday officials ready

హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క‌రీంన‌గ‌ర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ లో ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. ఇందుకు గాను 2 కౌంటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేశారు. ముందుగా 753 పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కిస్తారు. ఈ క్ర‌మంలో కౌంటింగ్ మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

2 కౌంటింగ్ హాల్స్ లో ఓట్ల‌ను లెక్కిస్తారు. వాటిల్లో 14 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. మొత్తం 22 రౌండ్ల‌లో కౌంటింగ్ పూర్త‌వుతుంది. ఒక్కో రౌండ్‌కు 14 ఈవీఎంల‌లోని ఓట్ల‌ను లెక్కిస్తారు. ఈ క్ర‌మంలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫ‌లితం వెల్ల‌డి కానుంది.

కాగా హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో హుజురాబాద్ మండ‌లంలోని ఓట్ల‌ను 6 రౌండ్ల‌లో లెక్కిస్తారు. అలాగే వీణ‌వంక మండ‌లం ఓట్ల‌ను 4 రౌండ్ల‌లో, జ‌మ్మికుంట మండ‌లంలోని ఓట్ల‌ను 5 రౌండ్ల‌లో, ఇల్లంత‌కుంట మండలంలోని ఓట్ల‌ను 3 రౌండ్ల‌లో, క‌మ‌లాపూర్ మండ‌లంలోని ఓట్ల‌ను 4 రౌండ్ల‌లో లెక్కిస్తారు. కాగా ఇప్ప‌టికే హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొన‌గా.. మ‌రికొన్ని గంట‌ల్లో ఆ ఉత్కంఠ‌కు తెర ప‌డ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now