Hunt Movie : మహేష్ బావ సుధీర్ బాబు హిట్స్ , ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హంట్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. మహేష్ సూరపనేని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 26న విడుదలైంది. ఈ సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద ప్రసాద్ నిర్మించిన హంట్ చిత్రంలో సీనియర్ నటులు శ్రీకాంత్, కోలీవుడ్ యాక్టర్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ కీలక పాత్రలు పోషించగా, సుధీర్ బాబు మెమొరీ లాస్ పోలీస్ ఆఫీసర్‌గా తనదైన శైలిలో నటించి మెప్పించాడు.
థియేటర్స్‌లో ప్రేక్షకులని అలరించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.తాజా సమచారాం ప్రకారం ఫిబ్రవరి 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.. కాగా ప్రతి చిత్రం దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సుధీర్ బాబు నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
నిజానికి హంట్ చిత్రం దాదాపు పదేళ్ల కిందటే మలయాళంలో వచ్చిన ‘ముంబై పోలీస్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. సౌత్ ఇండియన్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, జయసూర్య తదితరులు లీడ్ రోల్స్ పోషించారు. ఇక తెలుగు రీమేక్ విషయానికొస్తే.. చిత్ర శుక్లా ఫిమేల్ లీడ్‌గా నటించింది. కబీర్ దుహన్ సింగ్, మైమ్ గోపి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అరుల్ విన్సెంట్ కెమెరా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రంలో మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, రవి వర్మ, ‘జెమినీ’ సురేష్ కీలకపాత్రలలో నటించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…