iPhone 12 : ఐఫోన్ 12 ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు.. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో భారీ డిస్కౌంట్‌..!

May 11, 2022 9:13 AM

iPhone 12 : ఐఫోన్‌ను కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా ? అయితే ఇదే మంచి స‌మ‌యం. అవును.. ఎందుకంటే యాపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ ఫోన్ల‌పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో ప్ర‌త్యేక‌మైన ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల ఈ ఫోన్ల ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. ఏకంగా రూ.11వేల మేర డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు. క‌నుక ఐఫోన్‌ను కొనాల‌ని చూస్తున్న వారికి ఇది మంచి స‌మ‌యం అని చెప్ప‌వ‌చ్చు. ఇంత‌కు మించిన అద్భుత‌మైన మ‌ళ్లీ దొర‌క‌క‌పోవ‌చ్చు. క‌నుక ఐఫోన్‌ను కొనాలంటే ఇప్పుడే కొనేయండి. ఇక అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌ల‌లో ఈ ఫోన్ల‌పై ఉన్న ఆఫ‌ర్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

huge discounts on iPhone 12 in Amazon and flipkart
iPhone 12

అమెజాన్‌లో ఐఫోన్ 12కు చెందిన 64జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.65,900 ఉండ‌గా.. దీనిపై రూ.11వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఫోన్ ను రూ.54,900 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. ఇక పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేస్తే గ‌రిష్టంగా రూ.11,650 వ‌ర‌కు అద‌న‌పు డిస్కౌంట్ ల‌బిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధ‌ర రూ.43,250 అవుతుంది. ఇక ఐసీఐసీఐ, కోట‌క్‌, ఆర్‌బీఎల్ కార్డుల‌తో ఈ ఫోన్‌ను కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీంతో ఫోన్ ధ‌ర ఇంకా త‌గ్గుతుంది. ఇలా భారీ త‌గ్గింపు ధ‌ర‌కు ఐఫోన్ 12ను సొంతం చేసుకోవ‌చ్చు. అలాగే ఈ ఫోన్‌కు చెందిన 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.70,900 ఉండ‌గా.. రూ.11వేల డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.94,900 ఉండ‌గా.. దీనిపై రూ.26,901 డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. అయితే ఐఫోన్ 12 మినీ మాత్రం ప్ర‌స్తుతం అమెజాన్‌లో అందుబాటులో లేదు.

ఇక ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12కు చెందిన 64జీబీ మోడ‌ల్ పై 13 వాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.56,999 కు కొన‌వ‌చ్చు. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.13వేల వ‌ర‌కు అద‌న‌పు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. దీంతో ఫోన్ ధ‌ర రూ.43,999 అవుతుంది. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో 256 జీబీ మోడ‌ల్ పై మాత్రం ఆఫ‌ర్‌ను అందించ‌డం లేదు.

కాగా ఫ్లిప్‌కార్ట్‌లోనే ఐఫోన్ 12 మినీపై ఏకంగా 16 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల ఈ ఫోన్ రూ.49,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే అద‌నంగా మ‌రో రూ.13వేల వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment