Heroes : మ‌న హీరోల‌కు సూప‌ర్ స్టార్‌, మెగాస్టార్ బిరుదులు ఎలా వ‌చ్చాయో తెలుసా..?

October 4, 2022 7:35 PM

Heroes : ఒక హీరో స్టార్ గా ఎదగడానికి ఎంతోమంది టెక్నీషియన్స్ కృషి ఉంటుంది. కానీ వారెవరికీ రాని గుర్తింపు కేవలం ఒక హీరోకు మాత్రమే దక్కుతుంది. సినీ ఇండ‌స్ట్రీలో హీరోల‌కు ఉన్న క్రేజ్ మరెవ‌రికీ ఉండ‌దనే చెప్పవచ్చు. సినిమాను తెరపైకి తీసుకువచ్చిన దర్శ‌కులకు గానీ, కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు నిర్మించిన నిర్మాతలకు గానీ,  హీరోలతో స‌మానంగా క‌ష్ట‌ప‌డిన హీరోయిన్స్ గానీ..  ఇలా ఎవ‌రికీ కూడా హీరోకి ఉన్నంత క్రేజ్ ఉండ‌దు. ఒక సినిమా విడుదలైందంటే ప్రేక్షకులు తాము అభిమానించే హీరోని చూసే థియేటర్లకు క్యూ కడతారు.

అయితే సినిమా ఇండస్ట్రీ ప్రారంభ‌మైన కొత్త‌లో హీరోల‌కు ప్రత్యేకంగా గుర్తింపు అనేది ఉండేది కాదు. ప్రేక్షకులు సినిమాలోని న‌టీన‌టులంద‌రికీ స‌మాన‌మైన ప్రాధాన్య‌త ఇచ్చేవారు. కానీ కాల‌క్ర‌మేణా ఇండస్ట్రీని శాసించేది హీరోలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రేక్షకులలో హీరోలకు ఉన్న అభిమానం బట్టే దర్శకనిర్మాతలు కూడా వారి వద్దకు క్యూ కట్టడం మొదలుపెట్టారు. అంతే కాకుండా 1975 త‌రువాత కాలంలో హీరోలే సినిమా ఇండస్ట్రీకి మూలస్తంభాలు అనేంత‌లా ప‌రిస్థితులు మారిపోయాయి. ఆ త‌ర‌వాత కాలంలో టైటిల్స్ లో హీరోల‌కు స్టార్ హీరో బిరుదులు రావటం మొదలైంది.

how these Heroes got mega star and super star names
Heroes

అభిమానుల్లో హీరోకు ఉన్న క్రేజ్ ను బట్టి వారి పేరు మొదట్లో స్టార్ అనే బిరుదును ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌గిలించ‌డం మొద‌లుపెట్టారు. చిరంజీవిని మొద‌ట్లో సుప్రీం హీరో అని ముద్దుగా పిలిచేవారు. ఆ త‌ర‌వాత కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన మరణమృదంగం చిత్రంలో మొదటిసారిగా టైటిల్స్ లో మెగాస్టార్ చిరంజీవి అనే బిరుదులతో విడుదల చేశారు.  మ‌ర‌ణ‌మృదంగం సినిమా టైటిల్ లో చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును ద‌ర్శ‌కుడు కోదండ‌రామిరెడ్డి ఇవ్వటం జరిగింది.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రంతో  అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ అని సుకుమార్ బిరుదు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దాంతో అప్ప‌టి వ‌ర‌కూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ కాస్త ఐకాన్ స్టార్ గా పిల‌వ‌బ‌డుతున్నాడు. అంతే కాకుండా సూప‌ర్ స్టార్, క‌ళాత‌ప‌స్వి, రెబ‌ల్ స్టార్ ఇలా మిగితా స్టార్ లు బిరుదులు అన్నీ అలా వ‌చ్చిన‌వే. కానీ ఒక అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకు మాత్రం 1957లో అప్ప‌టి మంత్రి బెజ‌వాడ‌గోపాల‌రెడ్డి న‌ట‌సామ్రాట్ అనే బిరుదును ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now