Horoscope : ఈ తెలుగు సంవ‌త్స‌రంలో ఏ రాశి వారు డ‌బ్బు ఎక్కువ‌గా సంపాదిస్తారంటే..?

April 2, 2022 8:05 AM

Horoscope : ప్ర‌పంచ దేశాల్లో తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా స‌రే.. అంద‌రూ క‌ల‌సి జ‌రుపుకునే పండుగ ఒక్క‌టే. అదే ఉగాది. తెలుగు నూత‌న సంవ‌త్స‌రం. ఈసారి ఉగాది ఏప్రిల్ 2వ తేదీన వ‌చ్చింది. ఈ సంవ‌త్స‌రాన్ని శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం అని పిలుస్తున్నారు. ఇక ఉగాది అంటేనే మ‌న‌కు ముందుగా గుర్తుకు వచ్చేది.. పంచాంగం. పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఏ రాశి వారికి ఏం జ‌రుగుతుంది ? ఎవ‌రికి న‌ష్టం ఉంటుంది ? ఎవ‌రికి లాభం క‌లుగుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.

Horoscope for Ugadi 2022 to 2023 new Telugu year
Horoscope

ఈ ఏడాది మిథున‌రాశి, క‌న్యా రాశి, మ‌క‌ర రాశి, కుంభ రాశి వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ఏది చేసినా క‌ల‌సి వ‌స్తుంది. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. వీరికి ఈ ఏడాది డ‌బ్బు ప‌రంగా పెద్ద స‌మ‌స్య‌లు ఉండ‌వు. డ‌బ్బు పొదుపు చేస్తారు. సంపాద‌న ఎక్కువ‌గానే ఉంటుంది.

ఇక మేష రాశి, వృష‌భ రాశి, క‌ర్కాట‌క రాశి, తుల రాశి, వృశ్చిక రాశుల‌కు చెందిన వారికి ఈ ఏడాది మిశ్ర‌మ ఫ‌లితాలు ఉంటాయి. ఆర్థిక స‌మ‌స్య‌ల‌కు పెద్ద‌గా ఇబ్బందులు ఉండ‌వు. కానీ సంపాద‌న మొత్తం ఖ‌ర్చుల‌కే స‌రిపోతుంది. క‌నుక పెద్ద‌గా డ‌బ్బును పొదుపు చేసే అవ‌కాశం ల‌భించ‌దు.

ఇక సింహ రాశి, ధ‌నూ రాశి, మీన రాశులకు చెందిన వారికి ఈ ఏడాది స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. ఆదాయం క‌న్నా వీరిది వ్య‌య‌మే ఈ ఏడాది ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక డ‌బ్బుల‌ను ఖ‌ర్చు పెట్టే విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించ‌డం మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now