Exam : పరీక్షలలో సెలబ్రిటీలకు సంబంధించి పలు ప్రశ్నలు కనిపించడం మనం చాలా సార్లు చూశాం. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆ తరహా ప్రయోగాలు చేయడం ఆపడం లేదు. మధ్యప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ లో సెలబ్రిటీల లైఫ్ పై ప్రశ్నలు అడగడం షాకిచ్చింది. ఓ ప్రయివేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్ధులకు పరీక్షలు జరుగుతున్నాయి. అందులో ఓ ప్రశ్నా పత్రంలో సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్ ల కుమారుడి పేరు ఏంటి ? అనే ప్రశ్న వచ్చింది. దీంతో విద్యార్ధులు, టీచర్లు షాక్ అయ్యారు.
ఈ విషయంపై తల్లి దండ్రులు అధికారులుకు ఫిర్యాదు చేశారు. కరెంట్ ఆఫైర్స్ సెక్షన్ నుంచైనా సెలబ్రిటీల గురించి ప్రశ్నలు రావడం ఏమిటో ! అంటూ అంతా ఆశ్యర్యపోతున్నారు. స్కూల్ విద్యార్ధుల ప్రశ్నా పత్రంలో ఇలాంటి ప్రశ్న రావడం పొరపాటున జరిగిందా ? లేక కావాలనే అడిగారా ? అన్న దానికి అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది.
ఇక ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే.. కరీనా – సైఫ్ కుమారుడు తైమూర్ అలీఖాన్ పటౌడీ. తైమూర్ పెద్ద కుమారుడు కాగా.. జహంగీర్ అలీఖాన్ పటౌడీ చిన్న కుమారుడు. కరీనా -సైఫ్ అలీఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండవ కుమారుడి పేరు అప్పట్లో వివాదాస్పదమైంది. పటౌడీ వంశస్తులకి జహంగీర్ అని పేరు పెట్టడం సరికాదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…