Heroine : ఈ హీరోయిన్ మాయలో పడ్డ మెగా హీరోలు..? ఆ లక్కీ హీరోయిన్ ఎవరంటే..?

August 20, 2022 3:38 PM

Heroine : ఓ యంగ్ హీరోయిన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అంటే చాలు, ఆమె మొదటి సినిమా ఫస్ట్ లుక్ నుంచి విడుదలయ్యే వరకూ దర్శక నిర్మాతల దగ్గర నుంచి హీరోల వరకు దృష్టి మొత్తం ఆ హీరోయిన్ పైనే ఉంటుంది. ఎప్పుడైతే ఆమె నటించిన చిత్రం రిలీజై హిట్ అందుకుంటుందో వెంటనే లక్కీ లేడీ అంటూ దర్శక నిర్మాతలు ఆమె కాల్షీట్స్ కోసం క్యూ కట్టేస్తారు. ఈ కోవలో పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. పూరీ చిత్రంతో పరిచయమైన ప్రతి హీరోయిన్ కి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే పూరీ హీరోయిన్ ని అంత గ్లామరస్ గా, రొమాంటిక్ గా అందరి దృష్టి హీరోయిన్ పై పడేలా చూపిస్తారు. ఇలా రొమాంటిక్ సినిమాతో అందరి దృష్టిలోకి వచ్చేసిన పూరీ జగన్నాథ్ హీరోయిన్ కేతిక శర్మ.

కేతిక శర్మ రొమాంటిక్ చిత్రంతో టాలీవుడ్ తెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కేతికా బోల్డ్ సీన్స్ తో చూసే ప్రేక్షకులకు ముచ్చెమటలు పట్టించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు లక్ష్యాన్ని సాధించలేకపోయింది. అదే రొమాంటిక్ చిత్రం కనుక సక్సెస్ అయ్యి ఉంటే కేతిక శర్మ కెరియర్ మరో విధంగా ఉండేది.

Heroine Ketika Sharma reportedly getting back to back movie chances
Heroine

రొమాంటిక్ చిత్రం ఫ్లాప్ అయినా కూడా ఈ చిత్రంలో కేతిక అందాల ఆరబోతకు పిచ్చ ఫాలోయింగ్ ఏర్పడింది. దీనితో వరుస సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది ఈ బ్యూటీ. రొమాంటిక్ చిత్రం తర్వాత నాగశౌర్య హీరోగా వచ్చిన లక్ష్య చిత్రంలో కూడా నటించింది కేతిక. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కానీ కేతికకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వరుసగా మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమా ఛాన్సులు కొట్టేసింది కేతికశర్మ.

వైష్ణవ తేజ్ తో రంగ రంగ వైభోగంగా అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా సాయి ధర‌మ్‌ తేజ్ కూడా కేతికనే తన సినిమాలో హీరోయిన్ గా కావాలని అడగడం జరిగిందట. దాంతో పవన్ కళ్యాణ్ నటిస్తూ, నిర్మిస్తున్న తమిళ్ సూపర్ హిట్‌ వినోద‌య సీతం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు, అందులో సాయి ధర‌మ్‌ తేజకి జోడీగా కేతికను తీసుకున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఒక్క హీరోతో నటించి కేతిక శర్మ వరుసగా మెగా హీరోలతో జోడీ కట్టడానికి ఛాన్స్ కొట్టేసింది అంటూ సమాచారం వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే కేతిక రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధర‌మ్ తేజ్ సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగినా ఆశ్చర్యపడనవసరంలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment