Laya : ఒకప్పటి అందాల హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె 90లలో హీరోయిన్‌గా ఎంతగానో పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా 1999 నుంచి 2003 వరకు ఈమెకు గోల్డెన్ టైమ్ నడిచిందనే చెప్పాలి. ఆ సమయంలో లయ నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఫ్యామిలీ, లవ్ ఓరియెంటెడ్ చిత్రాలతో లయ ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈమె తెలుగు హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పటి తెలుగు హీరోయిన్ల తరువాత లయకే అంత పేరు వచ్చిందని చెప్పవచ్చు.
లయ చూడచక్కని అందం, అభినయంతోనే కాదు.. తన నాట్యంతోనూ ఆకట్టుకుంది. స్వతహాగా నృత్యాకారిణి కావడంతో సినిమాల్లో చేయడం ఈమెకు పెద్దగా ఇబ్బంది కాలేదు. గ్లామర్ షో చేయకపోయినా ఈమెకు నటన పరంగా అవకాశాలు బాగానే వచ్చాయి. ఇక లయకు సినీ ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. ఈమె సినిమాల్లో రాణిస్తుండగానే డాక్టర్ శ్రీగణేష్ అనే వైద్యుడిని పెళ్లి చేసుకుంది. తరువాత అమెరికాలోనే సెటిల్ అయిపోయింది. వీరికి ఒక కుమారుడు వచన్, కుమార్తె శ్లోక ఉన్నారు.
అయితే లయ అప్పుడప్పుడు తన కుమార్తెతో కలిసి పలు సినిమా పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ అలరిస్తుంటుంది. కానీ ఈమె కుమార్తెకు చెందిన ఫొటోలను క్లోజప్‌లో ఏవీ విడుదల చేయలేదు. ఇక ఇటీవలే తన భర్త, పిల్లలతో కలిసి విహార యాత్రకు వెళ్లిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సోషల్ మీడియాలో లయ ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి.
ఇక ఈమధ్యే ఆమె తన కుమార్తె శ్లోక ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఆమెను చూసి అచ్చం తల్లిలాగే క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె కుమార్తె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే శ్లోక సినిమాల్లోకి వస్తుందా.. రాదా.. అనే విషయం మాత్రం సందిగ్ధమే. ఎందుకంటే లయ అమెరికాలో సెటిల్ అయింది కనుక తన పిల్లలను సినిమాల వైపు కాకుండా ఇతర రంగాల వైపు మళ్లించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…