ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ ఆసిన్ ఇప్పుడు ఏ విధంగా మారిపోయందో చూశారా..?

August 19, 2022 2:32 PM

2003లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఆసిన్. ఈ చిత్రంలో ఆసిన్ రవితేజకు జోడీగా నటించి ఎంతో అద్భుతమైన నటనను కనబరిచింది. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హీరో రవితేజకు, హీరోయిన్ ఆసిన్ కూడా అమ్మనాన్న ఓ తమిళమ్మాయి  చిత్రం ద్వారా మంచి గుర్తింపు వ‌చ్చింది.

ఈ చిత్రంలో ఆసిన్ నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది. అప్పట్లో నిజంగా తమిళ అమ్మాయి అన్నట్లు నటనతో అందర్నీ ఆకట్టుకుంది. వాస్తవానికి ఆసిన్ ఒక మలయాళం అమ్మాయి. మొదటి చిత్రమే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడం ద్వారా ఆసిన్ ఆ తర్వాత నాగార్జున శివమణి చిత్రానికి ఆఫర్ చేజిక్కించుకుంది. ఆసిన్ నటన, ప్రతిభ నచ్చడంతో శివమణి చిత్రంలో కూడా ఆఫర్ ఇచ్చారు దర్శకుడు పూరీ జగన్నాథ్.

have you seen how asin changed now

శివమణి చిత్రం కూడా సక్సెస్ అవ్వడంతో వరుస ఆఫర్ల‌ను దక్కించుకుంటూ బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ, వెంకటేష్ తో ఘర్షణ, పవన్ కళ్యాణ్ తో అన్నవరం వంటి చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది. సూర్య నటించిన గజినీ చిత్రం హిందీలో కూడా రీమేక్ చేశారు. తర్వాత 2008లో అమీర్ ఖాన్ నటించిన గజనీ హిందీ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరకు దూరమైన ఆసిన్ బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని వరుస ఆఫర్లు సంపాదించుకుంటూ.. కెరీర్ మంచి పీక్స్ స్థాయిలో ఉన్న సమయంలో 2016లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది.

రాహుల్ శర్మ, ఆసిన్ జంటకు ఒక పాప కూడా ఉంది. మొదటి నుంచి ఆసిన్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆమెకు గానీ, ఆమె కుటుంబానికి సంబంధించిన ఫొటోస్ గానీ బయటకు కనిపించవు. కానీ తాజాగా ఇప్పుడు ఆమె ఫ్యామిలీతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఆసిన్ మునుపటి కన్నా ఇంకా ఎక్కువ గ్లామరస్ లుక్ తో కనిపిస్తూ అందరి చూపులను ఆకర్షించింది. నిజంగా మనం చూస్తుంది ఆ ఆసిన్ యేనా అనే విధంగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment