Annie Rajanna Movie : రాజన్న మూవీలో నటించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!

July 31, 2022 7:24 PM

Annie Rajanna Movie : దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో 21 డిసెంబర్‌ 2011న రిలీజ్‌ అయిన మూవీ రాజన్న. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఇందులో అనేక మంది నటించినా.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించిన అన్నీకి మాత్రం ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈమె అనుకోకుండా ఒక రోజు మూవీతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పరిచయం అయింది. తరువాత పలు సినిమాల్లో చేసి మంచి పేరు తెచ్చుకుంది.

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన రాజన్న మూవీలో అన్నీ ముఖ్య పాత్రలో నటించింది. రాజన్న సినిమాలో ఈమె మల్లమ్మ పాత్రలో నటించింది. ఈమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. అలాగే చరణ్‌ చేసిన రంగస్థలం మూవీలో ఆయనకు చెల్లెలి పాత్రలోనూ ఈమె నటించింది.

have you seen how Annie Rajanna Movie changed
Annie Rajanna Movie

ఇక సినిమాలతోపాటు అన్నీ సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను అందులో ఈమె షేర్‌ చేస్తోంది. ఈమె రవితేజ నటించిన విక్రమార్కుడులోనూ యాక్ట్‌ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు వెబ్‌ సిరీస్‌లలోనూ ఈమె సందడి చేసింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నీ చైల్ట్‌ ఆర్టిస్ట్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు లేకపోయినా.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. అందులో భాగంగానే ఈమె ఫొటోలు వైరల్‌ అవుతుంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now