RRR Movie : ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఈ చిన్న విషయాన్ని మీరు గమనించారా ? అసలు ఎవరూ గుర్తించనేలేదు..!

May 28, 2022 7:10 PM

RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ.. ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌ అయి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇటీవలే ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్‌ అయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఉత్తరాదిలోనూ ఘన విజయం సాధించింది. దీంతో రాజమౌళి ఖాతాలో మరో హిట్‌ వచ్చి చేరింది. ఈ మూవీలో తారక్‌ భీమ్‌గా.. చరణ్‌ అల్లూరిగా నటించి అలరించారు. అయితే అన్ని మూవీల్లోనూ చిన్న చిన్న విషయాలను కూడా దర్శకులు జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్నట్లే రాజమౌళి కూడా పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన తీసిన సినిమాలను బాగా పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ ఇలాంటి ఓ చిన్న విషయమే ఉంది. దాన్ని రాజమౌళి ఎంతో జాగ్రత్తగా చూపించారు. దాని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో నదిలో ఓ బాలుడు పడవపై చిక్కుకుపోయినప్పుడు భీమ్‌, రామరాజు ఇద్దరూ తాడుతో ఊగుతూ ఆ బాలుడికి చెరో వైపుకు వస్తారు. అనంతరం రామరాజు అప్పటి భారత జెండాను పట్టుకుని వస్తాడు. దీంతో భీమ్‌, రామరాజు ఇద్దరూ ఆ బాలున్ని రక్షిస్తారు. అయితే ఆ జెండా గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. ఈ జెండా తొలి భారతీయ జెండా. 1906 ఆగస్టు 7న వాడుకలోకి వచ్చింది. అప్పట్లో కోల్‌కతాలోని పార్శీ బగన్‌ చౌక్‌లో దీన్ని మొదటిసారిగా ఆవిష్కరించారు. అయితే ఆ జెండాను కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే వాడారు. 1907లో జెండా మళ్లీ మారింది.

have you identified this small thing in RRR Movie
RRR Movie

1906లో ఆవిష్కరించబడిన మొదటి భారతీయ జెండాపై వందే మాతరం అన్న అక్షరాలు ఉంటాయి. పైన ఆకుపచ్చ, మధ్యలో పసుపు, కింద ఎరుపు రంగులు ఉంటాయి. ఈ రంగులపై పలు చిహ్నాలు కూడా ఉంటాయి. ఇక ఈ జెండాను కేవలం సంవత్సరం పాటు మాత్రమే వాడారు. 1907లో ఇంకో జెండాను ఆవిష్కరించారు. అంటే.. మనకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో చూపించింది.. 1906లో ఆవిష్కరించబడిన జెండా. కనుక ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని కథ కూడా 1906లో జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రాజమౌళి చాలా చిన్న విషయాలలో కూడా ఎంతో జాగ్రత్త వహిస్తారని చెప్పవచ్చు. అందుకనే ఆయన తీసిన సినిమాలు అన్నీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఫ్లాప్‌ కాకుండా అన్నీ హిట్‌ అయ్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now