Baahubali : తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి 1, 2 సినిమాలు గొప్ప కళాఖండాలు అనే చెప్పవచ్చు. తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన అద్భుతమైన సినిమాలుగా నిలిచిపోతాయి. తెలుగు సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అని మాట్లాడుకోవచ్చు. ఇక ఈ సినిమాల దర్శకుడు రాజమౌళిని కచ్చితత్వానికి, సంక్లిష్టతకి మారుపేరుగా చెబుతారు. సినిమాలోని చిన్న చిన్న అంశాలను కూడా ఎంతో విశ్లేషణతో రూపొందిండంలో ఆయనను మించిన వారు లేరు. అలాగే బాహుబలి 2 సినిమాను తీసుకున్నప్పుడు కూడా దానిలో అంతర్లీనంగా దాగి ఉన్న ఎన్నో విషయాలు మామూలు ప్రేక్షకుల దృష్టికి వచ్చి ఉండవు.
ప్రేక్షకులు ఆ సినిమాను ఎన్ని సార్లు చూసినప్పటికీ అందులోని విషయాలను గుర్తించరు. అలాంటి ఒక సన్నివేశం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. బాహుబలి 2 చిత్రంలో అమరేంద్ర బాహుబలిని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించేందుకు అలాగే భల్లాల దేవుడిని రాజుగా పట్టాభిషేకం జరిగే సన్నివేశంలో అతని సింహాసనానికి ఎదురుగా ఎందరో రాజులు, మంత్రులు, ఇంకా కుంటాల రాజ్యం నుండి వచ్చిన వారు కూడా ఆసీనులై ఉంటారు. వారిలో కుడి వైపు కూర్చున్న వారి ఆసనాలపై రక్షణగా గొడుగు లాంటి నిర్మాణాలు ఉంటాయి. కానీ ఎడమ వైపు కూర్చున్న వారికి మాత్రం అలాంటివేవీ లేకపోవడం మనం గమనించవచ్చు. ఎందుకంటే కుడి వైపున మాహిష్మతి రాజ్యానికి చెందిన వారు కూర్చొని ఉండగా, ఎడమ వైపు దేవసేన రాజ్యం కుంటాలకి చెందిన వారు ఆసీనులై ఉంటారు. దర్శకుడు దీని ద్వారా భల్లాల దేవుడి పక్షపాత వైఖరిని చూపించాలని భావించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
ఇదే విధంగా అమరేంద్ర బాహుబలి కొడుకైన మహేంద్ర బాహుబలి భల్లాల దేవుడిని ఓడించి తన పట్టాభిషేకం జరిగే సమయంలో అతనికి ఎదురుగా రెండు వైపులా కూర్చున్న వారికి పైన గొడుగులు ఉండడం గమనించవచ్చు. కాగా భల్లాల దేవుడి పాలనలో సామ్రాజ్యంలో అసమానత, అప్రజాస్వామ్యం, అసూయ, ద్వేషం లాంటివి నిండి ఉండగా, అదే మహేంద్ర బాహుబలి పాలనలో సమానత్వం, సానుభూతి, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతాయని దర్శకుడు ఆ ఇద్దరి మధ్య తేడాను చూపించాడు. ఇలాంటి సూక్ష్మమైన విషయాలను కూడా అంత శ్రద్ధతో తీయడం ఒక్క రాజమౌళికే చెల్లిందని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…