Viral Pic : ప్రపంచం మొత్తం టెక్నాలజీ దిశగా పరుగులు పెడుతోంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాలో ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అయిపోతోంది. సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎంతగానో దగ్గరవుతున్నారు. సెలబ్రిటీలు పోస్ట్ చేసే చిన్ననాటి జ్ఞాపకాలు కూడా క్షణాల వ్యవధిలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఒక హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన తన చిన్ననాటి ఫోటో అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఎవరు ఈ క్యూట్ బేబీ అంటూ వెతుకులాట మొదలైంది. ఈ ఫోటోలలో ఉన్న ముద్దులొలికే ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్. ఇప్పుడు ఆ హీరోయిన్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్కూల్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరిని ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాలో హీరో వరుణ్ కు జోడిగా నటించి హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ అంటూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి చిత్రంతోనే తన నటనతో, డాన్స్ తో కుర్రకారును తన మాయలో పడేసింది సాయి పల్లవి.
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ గా పరిచయమైనా కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవడం కోసం ఎక్స్‌పోజింగ్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అటు సినిమాలలోనూ, ఇటు యాడ్స్ లోనూ నటిస్తూ కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంటున్నారు. కానీ వీటన్నింటికి భిన్నంగా చిత్రంలో చేసే క్యారెక్టర్ కు మాత్రమే ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావిస్తూ ముందుకు దూసుకుపోతోంది లేడీస్ పవర్ స్టార్ సాయి పల్లవి. విరాటపర్వం, గార్గి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో తన సహజసిద్ధమైన నటనతో ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…