Manchu Lakshmi : తెలుగు సినీ ప్రేక్షకులకు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మోహన్‌బాబు వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. విదేశాల్లో చదువుకున్న ఈమె సినిమాల్లో నటించాలనే మక్కువతో ఫిలిం కోర్సు కూడా చేసింది. అయితే ఈమె విద్యాభ్యాసం ఎక్కువగా ఫారిన్‌లో జరగడం వల్ల ఈమె భాష అంతా ఇంగ్లిష్, తెలుగు కలగలిపిన యాసలో ఉంటుంది. కనుక ఈమె మాటలకు చాలా మంది పగలబడి నవ్వుతుంటారు. అయినప్పటికీ మంచు లక్ష్మి వీటన్నింటినీ పట్టించుకోదు.
ఇక అనగనగ ఓ ధీరుడు సినిమాలో మంచు లక్ష్మి విలన్‌గా నటించి మెప్పించింది. తరువాత కూడా పలు సినిమాల్లో నటించింది. కానీ అవేవీ పెద్దగా హిట్ కాలేదు. దీంతో సినిమాలకు కొంతకాలం పాటు దూరంగా ఉంది. అయితే మళ్లీ ఇప్పుడు ఆమె పలు చిత్రాల్లో నటిస్తోంది. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో ఈమె ఓ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. అయితే వాస్తవానికి మంచు లక్ష్మి ఇప్పుడు కాదు.. చిన్నప్పుడే బాలనటిగా నటించి గుర్తింపు పొందింది. ఈమె నటించిన సినిమా హిట్ కూడా అయింది.
మంచు లక్ష్మి తన తండ్రి మోహన్ బాబు హీరోగా నటించిన పద్మవ్యూహం సినిమాలో నటించింది. ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. అలాగే ఆయనే స్వయంగా ఈ మూవీని నిర్మించారు. ఇందులో ఆయన ఆలయ పూజారి పాత్రలో నటించగా.. ఆయనకు కుమార్తెగా మంచు లక్ష్మి బాలనటిగా నటించింది. ఈ మూవీ 1980లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె నటిస్తున్న సినిమాలు హిట్ కావడం లేదు. దీంతో నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…