Hari Krishna : ఒకే ఒక్క కారణం వలన ఎన్టీఆర్ తో రెండేళ్ల‌పాటు మాట్లాడటం మానేసిన‌ హరికృష్ణ..!

October 11, 2022 7:07 PM

Hari Krishna : ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చి వెండితెరకు దేవుడిగా కొలిచే స్థాయికి ఎదిగారు ఎన్టీఆర్. తెలుగు తెర ప్రేక్షకులకు మొదటిగా రాముడు, కృష్ణుడు అనగానే గుర్తుకు వచ్చేది ఎన్టీఆరే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ఎనలేని సేవలు ఎన్నో ఇండస్ట్రీకి అందించారు. సినిమాల్లో స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్  రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో అతి తక్కువ కాలంలో ఆంధ్ర రాష్ట్ర సీఎంగా అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. ఆయన అద్బుత‌మైన ప‌త‌కాల‌తో పేద‌ప్ర‌జ‌ల క‌డుపునింపాడు. కథానాయకుడుగానే కాకుండా  రాష్ట్ర నాయకుడుగా కూడా తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు.

ఆ తర్వాత తరంలో ఎన్టీఆర్ సినీ వారసులుగా ఆయన తనయులు బాలకృష్ణ మరియు హరికృష్ణ వెండితెరపై అడుగుపెట్టారు. బాలకృష్ణ స్టార్ హీరోగా గుర్తింపు పొందగా, హరికృష్ణ తక్కువ సినిమాలలోనే నటించి సూపర్ హిట్స్ అందుకుని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. హ‌రికృష్ణ హీరోగా న‌టించిన సీత‌య్య‌, టైగ‌ర్ హ‌రిచంద్ర‌ప్ర‌సాద్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అప్పటిలో బాగా ఆక‌ట్టుకున్నాయి.

Hari Krishna did not speak to Sr NTR for 2 years
Hari Krishna

ఇక ఎన్టీఆర్ కు హ‌రికృష్ణ అంటే చాలా ఇష్టం. హరికృష్ణ తండ్రి ఎన్టీఆర్ కు వెన్నులా ఉంటూ ఆయన సినిమా, రాజకీయలకు సంబంధించిన విషయాలను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఎన్టీఆర్ కూడా కొడుకు హరికృష్ణ ఏది అడిగినా కూడా కాద‌నేవాడు కాదు. కానీ రెండేళ్ల పాటు ఎన్టీఆర్ తో కొన్ని కారణాల వల్ల హరికృష్ణ అసలు మాట్లాడటలేదట.  హరికృష్ణ సినిమాల‌లోకి వచ్చిన కొత్తలో సినిమా థియేటర్ ను నిర్మించుకుంటానని ఎన్టీఆర్ తో చెప్పారట. త‌న కోసం సినిమా హాలును నిర్మించాల‌ని ఎన్టీఆర్ ని  కోరార‌ట‌. దాంతో ఎన్టీఆర్ తనకు ఇండస్ట్రీలో మంచి స్నేహితుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు సలహా కోసం వెళ్లగా అక్కినేని సినిమా హాల్ తో పెద్దగా లాభం ఉండదు. స్టూడియో నిర్మిస్తే బెటర్… వ్యాపారం కూడా జరుగుతుంది అని సలహా ఇచ్చారట.

దాంతో ఎన్టీఆర్ సినిమా హాలు నిర్మించకూడదని నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండే స్వభావం కలవారు.  అదే విష‌యాన్ని హ‌రికృష్ణ‌కు చెప్పారట ఎన్టీఆర్. దాంతో తనకోసం సినిమా హాలు నిర్మించలేదని తండ్రి ఎన్టీఆర్ తో హరికృష్ణ రెండేళ్ల పాటు మాట్లాడటం మానేశారట . అయితే ఆ త‌ర‌వాత కోపం త‌గ్గి నాన్నగారు చెప్పిందే కరెక్ట్ అని భావించి మ‌ళ్లీ తండ్రితో మాట్లాడార‌ట‌ హరికృష్ణ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now