Hari Hara Veera Mallu : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ డేట్ తెలిసిపోయింది..!

July 29, 2022 11:37 AM

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క తన పొలిటికల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ నుంచి రాష్ట్రం మొత్తం యాత్ర ప్రారంభించనున్న పవన్ అంతకుముందే తను కమిటైన సినిమాల విషయంలో ఒక క్లారిటీ వచ్చేలా చేస్తున్నారు. ఈ క్రమంలో అంతకుముందే ఓకే చెప్పిన సినిమాలకే ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ లిస్ట్ లో క్రిష్ డైరక్షన్ లో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా ఉంది. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం రత్నం ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న హరి హర వీరమల్లు సినిమా మరో 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది. 17వ‌ శతాబ్ధం నాటి కథతో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక దొంగ పాత్రలో నటిస్తున్నారు. తన కెరియర్ లో ఇప్పటివరకు చేయని డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సినిమా నుంచి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు. అదే ఈ సినిమాపై అంచనాల‌ను పెంచింది. ఇక లేటెస్ట్ గా హరి హర వీరమల్లు టీజర్ రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

good news to Pawan fans Hari Hara Veera Mallu teaser will be released soon
Hari Hara Veera Mallu

ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే రోజు హరి హర వీరమల్లు టీజర్ వస్తుందట. క్రిష్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో బాలీవుడ్ అందాల భామ జాక్వెలిన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఇక హరి హర వీరమల్లు సినిమా మాత్రం 2023 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now