Akhanda : బాల‌య్య రికార్డును ట‌చ్ చేయ‌ని చిరంజీవి.. బాలయ్య బాబు తోపు.. దమ్ముంటే ఆపు..

October 15, 2022 9:05 AM

Akhanda : ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ కామన్ కానీ సీనియర్ హీరోలు చిరంజీవి – బాలకృష్ణ మధ్య పోటీ అంటే ఆ మజాయే వేరు. తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా గాడ్ ఫాద‌ర్ వచ్చింది. ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఈ సినిమా వసూళ్లు కొంత డౌన్ అయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవి లూసిఫర్ ను బాలకృష్ణ బ్లాక్ బాస్టర్ అఖండ సినిమాతో పోల్చి చూస్తున్నారు. అయితే గాడ్ ఫాదర్ ఫ‌స్ట్ వీకెండ్ వ‌సూళ్లు, అఖండ ఫస్ట్ వీక్ రికార్డును టచ్ చేయలేకపోయింది.

గాడ్ ఫాదర్ ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఏపీ, తెలంగాణలో రూ. 40 కోట్లు రాబట్టింది. కర్ణాటకలో రూ. 4.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.75 కోట్లు రాబట్టింది. ఓవ‌రాల్‌గా 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 96 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రు. 53 కోట్ల షేర్ కొల్లగొట్టింది. అయితే గాడ్ ఫాదర్ కు ఏపీ, తెలంగాణలో ఏడో రోజు వసూళ్లు భారీగా పడిపోయాయి. కేవలం రూ. 83 లక్షల షేర్ మాత్రమే వసూలు అయింది. అదే బాలయ్య నటించిన అఖండ సినిమా ఏకంగా తొలి 11 రోజులు వ‌రుస‌గా కోటి రూపాయలకు తగ్గకుండా షేర్ రాబట్టింది. గాడ్ ఫాదర్ మాత్రం ఈ రికార్డు విషయంలో కేవలం 6 రోజులకే పరిమితం అయింది.

godfather not near Akhanda record balakrishna fans happy
Akhanda

ఇక గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా తొలి వారం రోజుల్లో రూ. 53 కోట్ల షేర్ రాబడితే, అఖండ రూ. 55 కోట్ల షేర్ రాబట్టింది. ఈ విధంగా ఇద్దరూ స్టార్ హీరోల రికార్డులను పోల్చి చూస్తూ చిరు బాలయ్యను టచ్ చేయలేకపోయాడు.. బాలయ్య బాబు తోపు.. దమ్ముంటే ఆపు అంటూ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. నెక్స్ట్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య, బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ 2 సినిమాల్లో ఎవరు రికార్డులను ఎవరు కొల్లగొడతారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now