Godfather Chiranjeevi : ప్రేక్ష‌కుల‌కు బంప‌ర్ న్యూస్‌.. భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు గాడ్ ఫాద‌ర్ మూవీ టిక్కెట్లు..?

October 1, 2022 8:14 PM

Godfather Chiranjeevi : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గతకొద్ది రోజులుగా వరుసగా భారీ చిత్రాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలు అత్యంత భారీ బడ్జెత్‌తో తెరకెక్కించినవి అవడంతో సినిమా రిలీజ్ సమయంలో టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తున్నాయి ఇక్కడి ప్రభుత్వాలు. దీంతో ప్రొడ్యూసర్స్ నష్టపోకుండా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు కానీ ఫలితం అందుకు భిన్నంగా ఉంది. కరోనా ప్రభావంతో సగటు మనిషి జీవితం తారుమారయ్యింది. ఇప్పుడిప్పుడే బతుకు బండి తిరిగి పట్టాలెక్కుతోంది.

ఇలాంటి సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడంతో ఇప్పటికే సతమతమవుతున్న ఓ సామాన్య మనిషి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎక్కువ ఖర్చు చేయలేక పోతున్నాడు. ఈ చిన్న లాజిక్ మిస్ చేసుకున్న సినీ పరిశ్రమ వరుసగా సినిమాలను భారీ టికెట్ రేట్లతో రిలీజ్ చేసి చేతులు కాల్చుకుంటున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే రిలీజ్ రోజున టికెట్ దొరకడం గగనంగా మారేది. అప్పట్లో టికెట్ రేటు సాధారణంగా ఉండటమే దీనికి కారణంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎంత పెద్ద స్టార్ అయినా పెరిగిన టికెట్ రేట్లతో థియేటర్లు వెలవెలబోతున్నాయి.

Godfather Chiranjeevi movie may release with reduced ticket prices
Godfather Chiranjeevi

అందుకే ఇప్పుడు స్టార్స్ తమ ఆలోచనని మార్చుకున్నారు. టికెట్ రేట్లు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దసరాకి రిలీజ్ అవబోతున్న మెగా మూవీస్ గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు కూడా టికెట్ల రేట్లు తగ్గించుకున్నాయని తెలుస్తుంది. అక్టోబర్ 6 నుంచి గాడ్ ఫాదర్ మెయిన్ థియేటర్ అయిన సుదర్శన్ 70 ఎంఎంలో టికెట్ రేటు 150 రూపాయలకే అందుబాటులో ఉంది. మొదటి రోజు కూడా దాదాపు అంతే ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. మెగాస్టార్ మెగా ప్లాన్ నిజంగానే మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. మరి తగ్గిన టికెట్ రేట్లతో అయినా చిరు సూపర్ హిట్ కొడతాడా.. కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడా.. లేదా.. అన్నది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now