GodFather 2022 Movie Review : గాడ్ ఫాద‌ర్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

GodFather 2022 Movie Review : ఆచార్య ఫెయిల్యూర్ అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి మ‌రోమారు గాడ్ ఫాద‌ర్ మూవీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీపై మొద‌టి నుంచీ అభిమానుల్లో ఎన్నో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ముఖ్యంగా గాడ్‌ఫాద‌ర్ ట్రైల‌ర్ అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. దీంతో ఈ మూవీ ద్వారా హిట్ ప‌డిన‌ట్లే అని భావించారు. అలాగే బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ కూడా న‌టించ‌డంతో అంచ‌నాలు ఒక రేంజ్‌కి వెళ్లిపోయాయి. ఈ క్ర‌మంలోనే అక్టోబ‌ర్ 5, శుక్ర‌వారం గాడ్ ఫాద‌ర్ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. అంద‌రి అంచ‌నాల‌ను అందుకుందా.. లేదా.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గాడ్ ఫాద‌ర్ మూవీ క‌థ‌..

సీఎం పీకేఆర్ మ‌ర‌ణంతో సినిమా మొద‌ల‌వుతుంది. ఆయ‌న మ‌ర‌ణం అనంత‌రం రాష్ట్రానికి ఎవ‌రు సీఎం అని అంద‌రూ చ‌ర్చించుకుంటారు. ఆయ‌న పార్టీలో ఉన్న ప్ర‌ముఖ నేత‌లు నేనే సీఎం కావాలి అంటే.. నేనే కావాలి.. అని వ్యూహాలు ప‌న్నుతుంటారు. ఈ క్ర‌మంలోనే బ్ర‌హ్మ (చిరంజీవి) ఎంట‌ర్ అవుతాడు. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు మారిపోతాయి. అయితే పీకేఆర్ అల్లుడు (స‌త్య‌దేవ్‌) చాలా శ‌క్తివంత‌మ‌వుతాడు. రాష్ట్రంలో సీఎం అభ్య‌ర్థిని నిర్ణ‌యిస్తాడు. అలాగే చీక‌టి వ్యాపారాల‌కు పెద్ద ఎత్తున తెర తీస్తాడు. అయితే అత‌ని గురించి ఓ క‌ఠోర నిజాన్ని తెలుసుకుంటారు. దీంతో క‌థ మొత్తం మారిపోతుంది. చివ‌ర‌కు బ్ర‌హ్మ ఏం చేస్తారు.. స‌త్య‌దేవ్‌కు చెక్ పెడ‌తారా.. సీఎం ఎవ‌రు అవుతారు.. క‌థ ఏమ‌వుతుంది.. పీకేఆర్‌కు, బ్ర‌హ్మ‌కు సంబంధం ఏమిటి.. అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

GodFather 2022 Movie Review

విశ్లేష‌ణ‌..

గాడ్‌ఫాద‌ర్‌గా మెగాస్టార్ చిరంజీవి సూప‌ర్బ్‌గా యాక్ట్ చేశార‌నే చెప్పాలి. ఆయ‌న‌కు తోడు స‌ల్మాన్ ఖాన్‌, న‌య‌న‌తార‌, స‌ముద్ర‌ఖ‌ని, స‌త్య‌దేవ్ లాంటి వారు త‌మ పాత్ర‌ల‌కు 100 శాతం న్యాయం చేశారు. ఇది రీమేక్ సినిమా కావ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేలా తెర‌కెక్కించారు. అందువ‌ల్ల చిరంజీవి ప‌లికే డైలాగ్స్ ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయాల‌ను ప్ర‌తిబింబిస్తాయి. ఇక సినిమాలో సీన్ సీన్‌కు ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే ఉత్కంఠ క‌లుగుతుంది. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా త‌న ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు.

అలాగే సినిమా మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌ఫీ బాగున్నాయి. చిరంజీవితోపాటు స‌ల్మాన్ ఖాన్ యాక్ష‌న్ సీన్ల‌ను కూడా ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు. ఓవ‌రాల్‌గా చెప్పాలంటే.. ఈ మూవీ చిరు అభిమానుల‌కు పండుగ వినోదాన్ని అందిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ వారం గ‌డిస్తే కానీ.. సినిమా హిట్టా.. ఫ్లాపా.. అన్న విష‌యం తెలియ‌దు. క‌నుక మూడు రోజుల వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఇక కొత్త‌ద‌నం కోరుకునే వారు క‌చ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM