Godfather 1st Day Collections : గాడ్ ఫాద‌ర్ మూవీ.. తొలి రోజు క‌లెక్ష‌న్స్ ఎంతంటే..?

October 6, 2022 4:24 PM

Godfather 1st Day Collections : గాడ్ ఫాద‌ర్ సినిమాతో చిరంజీవి మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన‌ట్టుగానే భావిస్తున్నారు. ఆచార్య లాంటి ఘోర‌మైన ఫ్లాప్ త‌రువాత గాడ్ ఫాద‌ర్ సినిమా ఆయ‌న‌కు కాస్త రిలీఫ్ ఇచ్చింద‌ని అంటున్నారు. ఒక ప‌క్క రీమేక్ సినిమా అయ్యి ఉండి, లూసిఫ‌ర్ తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ ఓటీటీలో అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ అంత‌గా ప్ర‌చారం లేక‌పోయినా మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్ట‌డంలో గాడ్ ఫాద‌ర్ సినిమా విజ‌య‌వంతం అయ్యింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

సినీ ట్రేడ్ వ‌ర్గాల నుండి అందిన స‌మాచారాన్ని బ‌ట్టి గాడ్ ఫాద‌ర్ మూవీ మొద‌టి రోజైన బుధ‌వారం నాడు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.38 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింద‌ని తెలిసింది. యూఎస్ లో ప్రీమియ‌ర్ షోల క‌లెక్ష‌న్లు కూడా క‌లిపి ఈ మొత్తం సాధించినట్టుగా చెబుతున్నారు. ఇక సీమ ఏరియాలో బ్లాక్ బ‌స్ట‌ర్ మాస్ హిట్ గా నిలిచింద‌ని అంటున్నారు. చిరంజీవి కెరీర్ లోనే వ‌సూళ్ల ప‌రంగా భారీ ఓపెనింగ్స్‌ సొంతం చేసుకుంద‌ని, బాస్ ఈజ్ బ్యాక్ అని అభివ‌ర్ణిస్తున్నారు.

Godfather 1st Day Collections do you know how much it is
Godfather 1st Day Collections

న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ త‌మ క్యారెక్ట‌ర్ల‌లో అద్భుతంగా చేశార‌ని, స‌ల్మాన్ ఖాన్ కూడా సినిమాకు ప్ల‌స్ పాయింట్ అయ్యాడ‌ని అని విశ్లేషిస్తున్నారు. పాజిటివ్ రివ్యూలు, మౌత్ ప‌బ్లిసిటీతోపాటు వ‌రుస సెల‌వులు రావ‌డంతో మంచి ప్రారంభ వ‌సూళ్లు ద‌క్కాయ‌ని అభిప్రాయ ప‌డుతున్నారు. ఇంకా హాలిడేస్ మిగిలి ఉండ‌డంతో రానున్న రోజుల్లో ఇంకా పుంజుకుంటుంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now