గుజరాత్ వల్సద్ రైల్వే స్టేషన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రైల్వే సిబ్బంది పోలీసులు ఉన్నఫలంగా ఆగి ఉన్న గుజరాత్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ రైలులోకి పరుగులు తీస్తూ వెళ్లారు. అయితే ఆగి ఉన్న రైలులో ఒక యువతి మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు భావించిన అధికారులు వెంటనే ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కానీ ఆ యువతి డైరీ చదివిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ డైరీ చదివిన అనంతరం పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటి ? అనే విషయం గురించి తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చేవరకు చూడాలని తెలిపారు. ఇక ఆ యువతి డైరీలో ఏం రాసింది అనే విషయానికి వస్తే..
సౌత్ గుజరాత్ కు చెందిన ఆ యువతి వడోదరలోని ఒక హాస్టల్‌లో ఉంటూ ఓ ఎన్జీవో సంస్థలో పనిచేస్తోంది. తన డైరీలో రాసిన ప్రకారం.. ఈనెల 4వ తేదీన ఇద్దరు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి కళ్ళకు గంతలు కట్టి ఆపై కాళ్లు, చేతులు కట్టేసి ఆటోలో ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్ళారు.
అయితే ఇది గమనించిన ఒక బస్సు డ్రైవర్ వారిని వెంబడించి వారి దగ్గరకు వెళ్ళాడు. అతనిని గమనించిన ఆ ఇద్దరు యువకులు భయంతో అక్కడినుంచి పారిపోయారు. ఆ బస్సు డ్రైవర్ సహాయంతో ఆమె తిరిగి ఎంతో సురక్షితంగా తన స్నేహితుల దగ్గరకు చేరుకుంది.
అయితే అలా ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకు వెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ అవమానాన్ని భరించలేకే ఆ యువతి ఇలా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో అసలు విషయం తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చే వరకు వేచి చూడాలని తెలిపారు.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…