Getup Srinu : గాడ్ ఫాదర్ సినిమాలో గెటప్ శ్రీను.. రెమ్యున‌రేష‌న్ ఎంత తీసుకున్నాడో తెలుసా..?

October 6, 2022 3:52 PM

Getup Srinu : ఆచార్య ఫ్లాప్ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాద‌ర్ సినిమా ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అక్టోబ‌ర్ 5వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్‌నే రాబడుతోంది. ఈ క్ర‌మంలోనే సినిమాకు అంత‌టా పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో చిరు ఫ్యాన్స్ సంబ‌రాల్లో మునిగి తేలుతున్నారు. దీని వ‌ల్ల ఆచార్య ఫ్లాప్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఇక గాడ్ ఫాద‌ర్ హిట్ కావ‌డంతో చిరంజీవికి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీ‌ను గాడ్ ఫాద‌ర్ లో న‌టించాడు. శ్రీ‌నుకి చిరంజీవి తన సినిమాలో అవకాశం ఇచ్చారు. గెటప్ శ్రీ‌ను కూడా ఈ సినిమా బాగా హిట్ అవుతుందని మెగా అభిమానులకు చొక్కాలు చింపుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు. ఇంతకీ గెటప్ శ్రీ‌ను ఈ సినిమాలో నటించడానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా. రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు అత‌ను రెమ్యున‌రేషన్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గెట‌ప్ శ్రీ‌ను చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడాడు.

Getup Srinu remuneration for godfather movie
Getup Srinu

ఒక ఆడియన్ గా నేను చిరంజీవి సినిమాలు చూసేవాడిని. అన్నయ్యకు నేను పెద్ద అభిమానిని. మెగాస్టార్ ని ఇన్‌స్పిరేషన్ గా తీసుకొని నేను ఇండస్ట్రీకి వచ్చాను. నాలాంటి వాళ్ళు ఎందరో ఇండస్ట్రీకి చిరంజీవిని ప్రేర‌ణ‌గా తీసుకొని వస్తున్నారని.. అలాంటి వారికి చిరంజీవి ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తున్నారని.. గెటప్ శీను తనదైన శైలిలో చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే అవకాశం నాకు రావడం నిజంగా పెద్ద అచీవ్‌మెంట్ అంటూ గెటప్ శ్రీ‌ను ఎమోషనల్ అయ్యాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now