Getup Srinu : దేవీ నాగ‌వ‌ల్లిని విడిచిపెట్ట‌డం లేదుగా.. గెట‌వుట్ అంటూ గెట‌ప్ శ్రీ‌ను కామెడీ.. అదిరిపోయింది..!

June 30, 2022 8:17 AM

Getup Srinu : న‌టుడు విశ్వ‌క్ సేన్, టీవీ న్యూస్ చాన‌ల్ యాంక‌ర్ దేవీ నాగ‌వ‌ల్లిల మ‌ధ్య ఎంత‌టి తారా స్థాయిలో గొడ‌వ జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. విశ్వ‌క్ సేన్ తాను న‌టించిన అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం సినిమా ప్ర‌మోష‌న్ కోసం ప్రాంక్ వీడియో చేశాడు. అయితే దీనిపై ఒక లాయ‌ర్ కోర్టులో కేసు వేశాడు. ప‌బ్లిక్‌లో పెట్రోల్ డ‌బ్బాలతో న్యూసెన్స్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. దీనిపై న్యూస్ చాన‌ల్‌లో డిబేట్ కూడా జ‌రిగింది. దానికి హాజ‌రైన విశ్వ‌క్‌సేన్‌కు, దేవీ నాగ‌వ‌ల్లికి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. దీంతో దేవీ నాగ‌వ‌ల్లి కోపంగా గెట‌వుట్ ఆఫ్ మై స్టూడియో అంటూ విరుచుకుప‌డింది. ఈ వీడియో ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో భారీ ఎత్తున వైర‌ల్ అయింది.

అలా దేవీ నాగ‌వ‌ల్లి, విశ్వ‌క్ సేన్‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాదాన్ని ప్రేక్ష‌కులు అంత సుల‌భంగా మ‌రిచిపోలేదు. దీనిపై జ‌బ‌ర్ద‌స్త్‌లోనూ స్కిట్స్ చేశారు. అయితే తాజాగా గెట‌ప్ శ్రీ‌ను అంద‌రూ మ‌రిచిపోయార‌నుకుంటున్న ఆ వివాదం తాలూకు వీడియోపై మ‌ళ్లీ స్కిట్ చేశాడు. జూలై 8వ తేదీన హ్యాపీ బ‌ర్త్ డే అనే మూవీ రిలీజ్ కానుంది. ఇందులో న‌టించిన న‌టుల‌తో గెట‌ప్ శ్రీ‌ను స్కిట్ చేశాడు. టీవీ చాన‌ల్‌లో డిబేట్ పెట్టి ఆ న‌టుల‌ను ఆహ్వానిస్తాడు. త‌న‌ను తాను గెట‌ప్ శ్రీ‌ను.. దేవి శ్రీ ప్ర‌సాద్ థ‌మ‌న్‌గా ప‌రిచ‌యం చేసుకుంటాడు. త‌రువాత డిబేట్ మొద‌ల‌వుతుంది. అందులో క‌మెడియ‌న్ స‌త్య‌, హ్యాపీ బ‌ర్త్ డే మూవీ హీరో న‌రేష్ అగ‌స్త్య కూడా వ‌స్తారు. అయితే చివ‌ర‌కు టైమ్ స్లాట్ అయిపోయింది వెళ్లిపోవాల‌ని గెట‌ప్ శ్రీ‌ను సూచిస్తాడు.

Getup Srinu done debate on Devi Nagavalli and Vishwak Sen issue
Getup Srinu

దీంతో ఆ న‌టుల‌కు చిరాకు వ‌స్తుంది. ఇంత‌లో వెన్నెల కిషోర్ లైవ్‌లోకి వ‌చ్చి విశ్వ‌క్ సేన్ అన్న‌ట్లు.. వాట్ ద ***.. అంటూ బూతు మాట‌లు మాట్లాడ‌తాడు. ఈ క్ర‌మంలో యాంక‌ర్‌గా డిబేట్ చేస్తున్న గెట‌ప్ శ్రీ‌ను రెచ్చిపోతాడు. వెన్నెల కిషోర్‌ను ప‌ట్టుకుని గెట‌వుట్ ఆఫ్ మై స్టూడియో అంటాడు. ఇందుకు వెన్నెల కిషోర్ నేను మీ స్టూడియోలో లేను.. బ‌య‌ట ఉన్నాను.. అంటాడు.. అయినా స‌రే గెట‌వుట్ ఆఫ్ మై స్టూడియో అని గెట‌ప్ శ్రీ‌ను మ‌ళ్లీ రెచ్చిపోతాడు. ఇలా స్కిట్ ముగుస్తుంది. ఈ విధంగా హ్యాపీ బ‌ర్త్ డే సినిమా ప్ర‌మోష‌న్ కోసం వారు ఈ విధంగా దేవీ నాగ‌వ‌ల్లి, విశ్వ‌క్ సేన్ వివాదంపై స్కిట్ చేసి అద‌ర‌గొట్టేశారు. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now