Jabardasth : రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Jabardasth : జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చిందన్న విషయం తెలిసిందే. ఇందులో గుర్తింపు పొందిన అనేకమంది ఆర్టిస్టులు సినిమాల్లో కూడా నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కొందరైతే ఏకంగా హీరోలుగా కూడా చేస్తూ ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నారు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో సుడిగాలి సుధీర్ టీం ఒకటి. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ ఈ ముగ్గురు కలిసి తమదైన శైలిలో స్కిట్లు చేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించే వారు. దీంతో జనాల్లో వీరి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే కొన్ని కారణాలతో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు.

దీంతో సుడిగాలి సుధీర్ టీమ్ పేరుపై రామ్ ప్రసాద్ కొత్తవారితో స్కిట్స్ చేస్తున్నాడు. కాగా ఇటీవల గెటప్ శ్రీను రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో రామ్ ప్రసాద్ కి కొంతమేర ఊరట లభించిందని చెప్పవచ్చు. అయితే సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తున్న గెటప్ శ్రీను జబర్దస్త్ కి ఎందుకు తిరిగి వచ్చాడ‌నే అనుమానాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. అదే సమయంలో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులలో ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువ అనే సందేహాలు కలుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం గెటప్ శ్రీను కంటే రామ్ ప్రసాద్ అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటాడ‌ని తెలుస్తుంది. రామ్ ప్రసాద్ నటుడే కాదు, రైటర్ కూడా.. సుడిగాలి సుధీర్ టీమ్ కి స్క్రిప్ట్స్ రాసేది రామ్ ప్రసాదే.

Jabardasth

అలాగే ఇతర టీమ్స్ కి కూడా స్క్రిప్ట్స్ అందిస్తాడు. అలా రామ్ ప్రసాద్ కు చాలా డిమాండ్ ఉంది. రామ్ ప్రసాద్ ఒక కాల్ షీట్ కి లక్షన్నర రూపాయ‌ల‌ వరకు తీసుకుంటున్నాడట. ఇక గెటప్ శ్రీను కాల్ షీట్ కి లక్ష రూపాయలు తీసుకుంటున్నాడట. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా రామ్ ప్రసాద్ చేస్తున్నాడు. ఆ షో ద్వారా రామ్ ప్రసాద్ మరికొంత సంపాదిస్తున్నాడు. అయితే గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ సినిమా అవకాశాలతో అంత కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. చాలా తక్కువ లెవెల్ నుంచి ఈ ముగ్గురు కమెడియన్స్ బుల్లితెర స్టార్స్ గా ఎదిగారు. సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కలిసి త్రీ మంకీస్ టైటిల్ తో ఓ మూవీ చేయడం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM