Vikram Movie : క‌మ‌ల‌హాసన్ విక్ర‌మ్ మూవీ.. మొత్తంగా ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోతుంది..!

Vikram Movie : కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కలయికలో వచ్చిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ విక్రమ్. ఈ చిత్రం గత జూన్ నెల 3న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ మరియు మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. విక్రమ్ చిత్రం తెలుగుతోపాటు అటు తమిళ, హిందీ భాషాల్లో కూడా విడుదలై  ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా ఓటీటీ వేదిక కూడా విడుదలైంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందంటే..

తొలి రోజే రూ.45 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన విక్రమ్‌ ఆ తర్వాత కొద్ది రోజులకే  రూ.150 కోట్ల మార్క్‌ను దాటి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసేసింది. వీకెండ్‌ను బాగా క్యాష్‌ చేసుకున్న విక్రమ్ చిత్రం ఆ తర్వాత కలెక్షన్లు రాబట్టికునే పరంగా తగ్గుతుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ విక్రమ్ బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగుతూనే ఉంది. కోలివుడ్ లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ చిత్రం కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది.

Vikram Movie

తమిళనాడులో ఈ చిత్రం రూ.184 కోట్ల‌ గ్రాస్, రూ.93 కోట్ల షేర్ రాబట్టింది. కేరళలో కూడా ఈ సినిమా రూ.40 కోట్ల‌ గ్రాస్, రూ.17 కోట్ల‌ షేర్ వసూలు చేసింది. కర్ణాటకలో రూ.25 కోట్ల‌ గ్రాస్ వస్తే రూ.12 కోట్ల‌ షేర్ రాబట్టింది. తెలుగులోనూ ఈ సినిమా తనదైన స్టైల్ లో రికార్డులను సృష్టించింది. రూ.34 కోట్ల‌ గ్రాస్, రూ.18 కోట్ల‌ షేర్ రాబట్టింది. ఇక మిగిలిన ప్రాంతాలలో రూ.18 కోట్ల‌ గ్రాస్, రూ.8 కోట్ల‌ షేర్ ను రాబట్టుకుంది.

ఇక ఓవర్ సీస్ మార్కెట్ అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ రూ.125 కోట్ల గ్రాస్, రూ.59 కోట్ల‌ షేర్ ను వసూలు చేసింది. విక్రమ్ చిత్రం భారీ కలెక్షన్లతో యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కు ఊహించని రేంజ్ లో లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ప్రపంచం వ్యాప్తంగా రూ.426 కోట్ల‌ గ్రాస్, రూ.207 కోట్ల షేర్ ను వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేసింది.

ఈ సినిమాను తెలుగులో విక్రమ్‌ హిట్‌ లిస్ట్‌ పేరుతో హీరో నితిన్‌, సుధాకర్‌ రెడ్డి విడుదల చేశారు.  ఇక  ఈ సినిమా ఈ నెల 8 నుంచి ఓటీటీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM

విడాకుల తర్వాత గోల్డెన్ టెంపుల్‌లో హన్సిక.. వైరల్ అవుతున్న ‘కీలక’ పోస్ట్!

వ్యాపార వేత్త సోహైల్ ఖ‌తురియాతో విడాకులు తీసుకున్న అనంత‌రం హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీల‌క పోస్టు…

Wednesday, 18 March 2026, 12:31 PM

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM