Garlic Milk Benefits : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వెల్లుల్లిని తమ ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లి చక్కని వాసనను, ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. దీన్ని మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. అయితే ఆయుర్వేదంలో వెల్లుల్లికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీన్ని అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. వెల్లుల్లి సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. అయితే రోజూ రాత్రి ఒక వెల్లుల్లి రెబ్బను వేసి మరిగించిన పాలను ఒక్క గ్లాస్ తాగితే చాలు. ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పురుషులు ఇలా తప్పకుండా తాగాలి. ఈ విధంగా తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలలో వెల్లుల్లి రెబ్బను వేసి మరిగించి రాత్రి పూట భోజనం అనంతరం తాగాలి. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. దగ్గు, జలుబు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. దీంతోపాటు ఆస్తమా నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. కఫం మొత్తం పోతుంది. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ కరుగుతుంది. దీని వల్ల రక్త నాళాలు శుభ్రంగా మారి.. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
పాలు, వెల్లుల్లి రెబ్బ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. పాలిచ్చే తల్లులు ఈ మిశ్రమాన్ని తాగితే దాంతో పాలు బాగా తయారవుతాయి. అలాగే ఎముకలు దృఢంగా మారుతాయి. చర్మ సమస్యలు ఉండవు. ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టదు. రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది.
ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల పురుషులకు ఎంతగానో మేలు జరుగుతుంది. వారిలో ఉండే శృంగార సమస్యలు పోతాయి. శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అంగస్తంభన సమస్య నుంచి బయట పడవచ్చు. ఇలా ఈ మిశ్రమంతో ఎన్నో లాభాలను పొందవచ్చు. కనుక సమస్యలు ఉన్నవారు రోజూ దీన్ని తాగాల్సి ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…