Gangotri Movie : గంగోత్రి సినిమా బ‌న్నీ క‌న్నా ముందు ఆ మెగా హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లింది.. అత‌ను ఎవ‌రో తెలుసా..?

Gangotri Movie : టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు పుష్ప సినిమాతో ఏ రేంజ్‌లో క్రేజ్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌న్నీకి బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. బన్నీ ఇప్పుడు ఇంత స్టార్ అయ్యాడు అంటే అందుకు ఇన్‌స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అల్లు అర్జున్ లో నటుడిని ప్రోత్సహించింది చిరంజీవి అని అంద‌రికి తెలిసిందే. గంగోత్రి సినిమాతో బన్నీ కెరీర్ ప్రారంభించగా, ఈ సినిమా ఆఫర్ బన్నీకి ఎలా వచ్చింది అనే వివరాలను నాగబాబు తాజాగా వెల్లడించారు.

మెగా పవర్ స్టార్ గా ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెగ సంద‌డి చేస్తున్న‌ రామ్ చరణ్ హీరోగా ఇంట్రడ్యూస్ కావాల్సిన సినిమా గంగోత్రి. కానీ అప్పుడే చరణ్ కి మెచ్యూరిటీ రాలేదని.. ఇంకా ట్రైనింగ్ కావాలని చెబుతూ.. ఆ ప్రాజెక్టును బన్నీ చేయాలని కోరారట చిరంజీవి. అలా బన్నీ గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఈ విషయాలను ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు. మా కుటుంబం నుంచి ఇంతమంది హీరోలు వస్తారని.. హీరోలు అవుతారని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇండస్ట్రీలో ఎలా అయితే అన్నయ్యను చూసి ఇన్ స్పైర్ అయ్యి హీరోలు అయ్యారో.. అలాగే మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఆయన స్పూర్తితోనే హీరోలు అయ్యారు అని నాగ‌బాబు అన్నారు.

Gangotri Movie

చిరంజీవి స్పూర్తితో హీరోగా కావాల‌ని అనుకున్న వాళ్లలో బన్నీ కూడా ఒక‌రు అని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. పుష్ప తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన బ‌న్నీ ప్ర‌స్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వైజాగ్ లో ఈ సినిమా షూట్ కొనసాగుతోంది. ఇప్పటికే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని రెండో షెడ్యూల్ ప్రారంభిస్తారని టాక్ . వీలైనంత త్వరగా ఈ సినిమా విడుదల చేయాలని సుకుమార్, చిత్రబృందం చూస్తుండ‌గా, వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌కి ఈ మూవీ రిలీజ్ కానుంద‌ని టాక్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM