Gangothri Child Artist : టాలీవుడ్‌లో ఇప్పటికే ఎంతో మంది బాలనటులు తమ సత్తాను చాటుకున్నారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు పెద్దయ్యాక హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారారు. కొందరు మాత్రం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో బేబీ కావ్య ఒకరు. ఈమె పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టలేరు. కానీ గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట చిన్నారి అంటే ఎవరైనా సరే సులభంగా గుర్తిస్తారు.
ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్, అదితి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితికి ఇదే తొలి సినిమా. అయినప్పటికీ ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అల్లు అర్జున్‌కు కూడా ఇదే తొలి సినిమా కావడం విశేషం. అంతకు ముందు ఆయన చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించారు. హీరోగా ఇదే తొలి సినిమా. ఇక కావ్య వల్లంకి పిట్ట పాటలో ఎంతో క్యూట్‌గా కనిపించింది. ఇప్పుడు గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. హీరోయిన్‌గా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.
కావ్యకు గంగోత్రి సినిమా సమయంలో వయస్సు 4 ఏళ్లు. ఇప్పుడు ఆమె వయస్సు 22 ఏళ్లు. ఈ క్రమంలోనే ఆమె చదువు పూర్తి చేసుకుంది. హీరోయిన్ కావడం కోసం ప్రయత్నిస్తోంది. కాగా గంగోత్రి సినిమాను అశ్వనీదత్ నిర్మించారు. ఇందులో నటించిన అందరికీ మంచి పేరు వచ్చింది. ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కీరవాణి సంగీతం అందించారు. పాటలు కూడా బాగానే హిట్ అయ్యాయి. ఇక కావ్య లేటెస్ట్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…