గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Gangothri Child Artist : గంగోత్రి సినిమాలోని ఈ చిన్నారి.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Gangothri Child Artist : టాలీవుడ్‌లో ఇప్పటికే ఎంతో మంది బాలనటులు తమ సత్తాను చాటుకున్నారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు పెద్దయ్యాక హీరోయిన్లుగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా మారారు. కొందరు మాత్రం…

Gangothri Child Artist : గంగోత్రి సినిమాలోని ఈ చిన్నారి.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Gangothri Child Artist : టాలీవుడ్‌లో ఇప్పటికే ఎంతో మంది బాలనటులు తమ సత్తాను చాటుకున్నారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు పెద్దయ్యాక హీరోయిన్లుగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా మారారు. కొందరు మాత్రం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో బేబీ కావ్య ఒకరు. ఈమె పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టలేరు. కానీ గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట చిన్నారి అంటే ఎవరైనా సరే సులభంగా గుర్తిస్తారు.

ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్‌, అదితి అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆర్తి అగర్వాల్‌ చెల్లెలు అదితికి ఇదే తొలి సినిమా. అయినప్పటికీ ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అల్లు అర్జున్‌కు కూడా ఇదే తొలి సినిమా కావడం విశేషం. అంతకు ముందు ఆయన చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించారు. హీరోగా ఇదే తొలి సినిమా. ఇక కావ్య వల్లంకి పిట్ట పాటలో ఎంతో క్యూట్‌గా కనిపించింది. ఇప్పుడు గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. హీరోయిన్‌గా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

Gangothri Child Artist Kavya see how she is now
Gangothri Child Artist

కావ్యకు గంగోత్రి సినిమా సమయంలో వయస్సు 4 ఏళ్లు. ఇప్పుడు ఆమె వయస్సు 22 ఏళ్లు. ఈ క్రమంలోనే ఆమె చదువు పూర్తి చేసుకుంది. హీరోయిన్‌ కావడం కోసం ప్రయత్నిస్తోంది. కాగా గంగోత్రి సినిమాను అశ్వనీదత్‌ నిర్మించారు. ఇందులో నటించిన అందరికీ మంచి పేరు వచ్చింది. ఈ మూవీ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. కీరవాణి సంగీతం అందించారు. పాటలు కూడా బాగానే హిట్‌ అయ్యాయి. ఇక కావ్య లేటెస్ట్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి