Gajuwaka Jhansi : ప్లీజ్ మీకు దండం పెడతా.. నా భర్తను వదిలేయండి : గాజువాక ఝాన్సీ

September 13, 2022 1:43 PM

Gajuwaka Jhansi : గాజువాకకి చెందిన లేడీ కండక్టర్ ఝాన్సీ. ఈ పేరుకు ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు తెగ మార్మోగిపోతోంది. ఉద్యోగరీత్యా కండక్టర్ అయిన ఝాన్సీకి డాన్స్ అంటే ప్రాణమట. ఆ ఇష్టంతోనే శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో ఝాన్సీ చేసిన డాన్స్‌ పర్ఫార్మెన్స్‌కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరికొందరు ఆమెకు ఏకంగా అభిమానులైపోయారు. ఆమె ఎక్స్‌ ప్రెషన్స్, గ్రేస్‌, డాన్స్‌ మూమెంట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆమెకు అభినందనలతోపాటు ట్రోల్స్ కూడా వచ్చాయి.

దీంతో ఆమె తీవ్ర ఆవేదన చెందింది. గురు పూజోత్సవం సందర్భంగా ఝాన్సీ టీమ్.. వాళ్ల గురువు రమేష్ మాస్టర్ ని సత్కరించింది. ఆ సందర్భంగా ఝాన్సీ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేసింది. తమకు మ‌ద్ద‌తు ఇస్తున్న వారు ఉన్నారు.. అదే సమయంలో కొందరు కావాలని ట్రోల్స్ చేస్తున్నారంటూ ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌ తర్వాత ఝాన్సీ స్టేజ్‌ మీద తాను ఒక ఆర్టీసీ కండక్టర్‌ అని, గాజువాక డిపోలో వర్క్‌ చేస్తానని తనని తాను పరిచయం చేసుకుంది. ఆమె అలా చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు.

Gajuwaka Jhansi requested not to comments on her husband
Gajuwaka Jhansi

ఆ తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం గురించి, డ్యాన్స్ కోసం ఆమెపడ్డ కష్టాలను తెలుసుకుని ఎంతోమంది మద్దతుగా నిలిచారు. ఇదే క్రమంలో కొందరు మాత్రం బ్యాడ్‌ కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో ఝాన్సీ మాట్లాడుతూ.. నన్ను కండెక్టర్‌ గా కాదు.. ఒక డ్యాన్సర్‌గా గుర్తించి శ్రీదేవీ డ్రామా కంపెనీ వాళ్లు ఆహ్వానించారు. అక్కడ నేను చేసిన పర్ఫార్మెన్స్‌ కి ఎంతో గొప్ప పేరొచ్చింది. అయితే వీడియోస్‌ కింద కొందరు బ్యాడ్‌ కామెంట్స్ చేస్తున్నారు. నన్ను ఎంతో సపోర్ట్‌ చేసిన నా భర్తను కూడా తిడుతున్నారు. దయచేసి అలా చేయకండి.. అంటూ ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా నెటిజన్లు బ్యాడ్ కామెంట్స్ ఆపుతారేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now