Gaddi Chamanthi : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా అస‌లు విడిచిపెట్ట‌కండి.. లాభాలు తెలిస్తే వెంట‌నే తెచ్చుకుంటారు..

November 27, 2022 12:03 PM

Gaddi Chamanthi : ఇదో కలుపుజాతి మొక్క అని గడ్డి చామంతిని చాలా మంది అనుకుంటారు. ఇది గ్రామాల్లోని పొలం గట్లపై ఎక్కువగా కనిపిస్తుంది. ఊరిశివారులో, రోడ్లపక్కన కూడా మనం ఎక్కువగా ఈ మొక్కను చూస్తూనే ఉంటాం. అంతేకాదు చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఈ ఆకుతో పలకపై రాసే ఉంటారు. అదేనండీ దీన్ని పలకాకుఅని, కొన్ని చోట్ల గడ్డిచామంతి, పుటపుటాలం, పలక ఆకులు, గాజు తీగ, నల్ల ఆలం, గాయాల ఆకు అనే పేర్లతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. కానీ అందరికీ బాగా తెలిసిన పేరు మాత్రం గడ్డి చామంతి మొక్క అనే. ఈ గడ్డి చామంతి మొక్కలో అనేక ఔషధ గుణాలున్నాయి.

ఈ మొక్కలలో ఉండే ఔషధగుణాలు తెలుసుకొని వాటిని మన వైద్యంలో ఉపయోగించుకుంటున్నాం. అలాంటి మొక్కలలో ఒకటైన గడ్డి చామంతి మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ మొక్క శాస్త్రీయ నామం ట్రైడాక్స్ ప్రొకంబన్స్. దీనిని ఇంగ్లీషులో మెక్సికన్ డైసీ, కోట్ బట్టన్స్ అని పిలుస్తారు. సంస్కృతంలో జయంతివేద అని అంటారు.

Gaddi Chamanthi benefits take this plant to your home
Gaddi Chamanthi

షుగర్ వ్యాధికి ఈ గడ్డి చామంతి మొక్క చాలా బాగా పనిచేస్తుంది. గడ్డిచామంతి ఆకులలో ఉండే జేర్యలోనిక్ అనే రసాయనం వలన ఇది షుగర్ వ్యాధికి చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో ఈ రసాయనం బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నీటిలో ఉండే ఫ్లోరైడ్ శక్తి వలన చాలామంది ఎన్నో అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ఫ్లోరైడ్ శక్తిని తగ్గించే గుణం ఈ గడ్డి చామంతి ఆకులకు ఉందని ఈమధ్యే పరిశోధనల్లో వెళ్లడయ్యింది.

గడ్డి చామంతి మొక్క ఆకులకి తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి ఉంది. ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో నూనెను తయారు చేసుకుని వాడితే మీ వెంట్రుకలు నల్లబడడంతో పాటు దృఢంగా పెరుగుతాయి. గడ్డి చామంతి ఆకులు, గుంటగలగర ఆకులు మరియు నల్ల నువ్వుల నూనె ఈ నూనె తయారీకి అవసరమవుతుంది. మొదటిగా ఈ రెండు ఆకుల రసం ఒక కప్పు, నువ్వుల నూనె ఒక కప్పు కలిపి సన్నని సెగపై మరిగించాలి.

నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి ఆ నూనెను తీసి వడకట్టి  పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత తలకు బాగా పట్టించాలి. రాత్రి నిద్రపోయేముందు నూనెను అప్లై చేసిన తర్వాత తెల్లవారుజామున తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ మీ జుట్టు నల్లబడుతుంది. ఈ నూనె వాడటం వలన జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా మారుతుంది. అంతేకాకుండా దోమలను పారదోలే లక్షణాలు కూడా గడ్డి చామంతి ఆకులలో ఉన్నాయి. ఎండిన ఆకులను తీసుకువచ్చి ఇంట్లో పొగబెట్టడం ద్వారా దోమలు ఉండకుండా పారిపోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now