Fun Bucket Bhargav : మళ్లీ జైలుకు పయనమవుతున్న ఫన్ బకెట్ భార్గవ్!

November 6, 2021 2:18 PM

Fun Bucket Bhargav : అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియా ద్వారా సెలబ్రేటీ హోదాను సంపాదించుకున్న ఫన్ బకెట్ భార్గవ్ గురించి ఈ మధ్య ప్రజలకు బాగా తెలిసిపోయింది. అతి తక్కువ సమయంలో మంచి కెరీర్ అందుకున్న ఇతగాడు అంతే త్వరగా కెరీర్ నాశనం చేసుకున్నాడు. అతడు గతంలో ఓ బాలికను లొంగ తీసుకొని గర్భవతిని చేయడంతో అతడిని అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్ ద్వారా విడుదలవ్వగా మళ్లీ జైలుకు పయనమవనున్నాడు భార్గవ్.

Fun Bucket Bhargav to go to jail yet again

సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యూట్యూబ్ లో ఫన్ బకెట్ పేరుతో పలు వీడియోలు చేశాడు. అంతేకాకుండా తనతోపాటు పలువురు అమ్మాయిలతో కూడా వీడియోలు చేశాడు. ఇక తనతోపాటు వీడియోలు చేసే ఓ 14 ఏళ్ల బాలికను చెల్లి అని పిలిచి లొంగదీసుకున్నాడు. దాంతో ఆ బాలిక గర్భవతని బయటపడడంతో అతడిపై దిశ, పోక్సో చట్టం కింద కేసు నమోదయింది.

అలా కొన్ని రోజులు జైల్లో ఉండగా బెయిల్ ద్వారా బయటికి వచ్చి తనది తప్పు లేదన్నట్లు ప్రచారాలు చేశాడు. అంతేకాకుండా యాటిట్యూడ్ కూడా అలాగే ఉండిపోయింది. ఇక షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడంతో తాజాగా అతడిపై మెమో ఫైల్ అయింది. అతడిపై కేసు విచారణలో కూడా సాక్షులను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేసినట్లు తెలిపారు. దీంతో అతడికి బెయిల్ రద్దు చేసి మళ్లీ 11వ తేదీన రిమాండ్ విధించి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు పోలీసులు. మొత్తానికి మళ్ళి జైలుకు పయనమవనున్నాడు భార్గవ్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now