Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌.. ఎప్ప‌టి నుంచంటే..?

September 14, 2022 3:41 PM

Flipkart : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్‌.. ద‌స‌రా దీపావ‌ళి పండుగ‌ల‌ను పుర‌స్క‌రించుకుని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వ‌హించ‌నున్న విషయం విదిత‌మే. ఈ నెల 23 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ కూడా అదే రోజు నుంచి బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ సేల్ ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా అనేక కంపెనీల‌కు చెందిన ప‌లు ర‌కాల ఉత్ప‌త్తుల‌పై ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్ల‌ను, డిస్కౌంట్ల‌ను అందివ్వ‌నున్నారు.

ఈ సేల్‌లో భాగంగా 90కి పైగా బ్రాండ్ల‌కు చెందిన 10వేలకు పైగా కొత్త ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యించ‌నున్నారు. అలాగే ప్ర‌ముఖ సెల‌బ్రిటీలు విరాట్ కోహ్లి, కృతి స‌న‌న్‌, ఆయుష్మాన్ ఖురానా, ర‌ణ‌వీర్ సింగ్‌, హృతిక్ రోష‌న్‌, పీవీ సింధు, కేఎల్ రాహుల్ తదిత‌రులు ఈ సారి ప్ర‌చార‌క‌ర్త‌లుగా ఉన్నారు.

Flipkart big billion days sale from september 23rd
Flipkart

ఇక ఈ సేల్‌లో అనేక ఉత్ప‌త్తుల‌ను నో కాస్ట్ ఈఎంఐ ప‌ద్దతిలో కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే వివిధ ర‌కాల బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌పై అద‌నపు డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ పే లేట‌ర్ ద్వారా రూ.1 ల‌క్ష వ‌ర‌కు లిమిట్ పొందే స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు. దీంతో వినియోగ‌దారులు ఫ్లిప్‌కార్ట్‌లో త‌మ‌కు న‌చ్చిన వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now