Fish Business : సాధారణంగా మనకు అందుబాటులో చేపల ధరలు ఎంత ఉంటాయి. రూ.100 నుంచి రూ.1వేయి మధ్య ఉంటాయి. కానీ ఆ చేపలు మాత్రం వీటి కన్నా ఎన్నో రెట్ల ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. అవే.. రెయిన్ బో ట్రౌట్ చేపలు. ఇవి మన దేశంలో కేవలం జమ్మూ కాశ్మీర్‌లో మాత్రమే లభిస్తాయి. అక్కడి మంచి నీటి సరస్సులలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. అక్కడ చాలా సరస్సుల వద్ద రోజుకు రూ.1వేయి చెల్లిస్తే వీటిని పట్టుకునే వీలు కల్పిస్తున్నారు. రోజుకు అలా రూ.1000 చెల్లించి 6 ట్రౌట్ చేపలను పట్టుకోవచ్చు. అంతకు మించి వీటిని పట్టుకోనివ్వరు. ఇక వీటిని బయట మార్కెట్‌లో కొనాలంటే కిలోకు దాదాపుగా రూ.2వేలు చెల్లించాల్సిందే. అంతటి ధరను ఇవి కలిగి ఉంటాయి.
ఇక ప్రస్తుతం మన దగ్గర కూడా ఈ చేపలను పెంచుతున్నారు. ఆదిత్య రిత్విక్ అనే యువకుడు రూ.25 కోట్ల పెట్టుబడితో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న కందుకూరు అనే ప్రాంతం వద్ద స్మార్ట్ గ్రీన్ అక్వాకల్చర్ అనే విధానంలో ఈ చేపలను పెంచుతున్నాడు. ఇవి అంత సులభంగా పెరగవు. చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండే నీరు వీటికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. అలాంటి చల్లని నీటిలోనే ఇవి ఎక్కువగా పెరుగుతాయి. అలాగే వీటిలో పోషకాలు కూడా దండిగానే ఉంటాయి. వీటిని అమెరికన్లు ఎక్కువగా తింటుంటారు. కనుకనే ఈ చేపలు ఇంతటి ధరను కలిగి ఉంటాయి. ఇక ఇవి ఏడాదికి ఒకసారి చేతికి వస్తాయి.
అయితే వీటిని పెంచేందుకు కావల్సిన వాతావరణ పరిస్థితులను సృష్టించడం కష్టమే. ముఖ్యంగా వీటి కోసం ఎల్లప్పుడూ చల్లని నీరు అందుబాటులో ఉండాలి. అందుకు ఓ ప్రత్యేకమైన నీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చల్లని నీరు నిరంతరంగా ఉంటేనే ఇవి మనుగడ సాగిస్తాయి. సులభంగా పెరుగుతాయి. అలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లతోనే ఆదిత్య ఈ చేపలను పెంచుతున్నాడు. ఇక వీటిని త్వరలోనే హైదరాబాద్ మార్కెట్‌లో విక్రయించనున్నట్లు తెలిపాడు. మరో 6 నెలల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
ఈ చేపల పెంపకం యూనిట్‌లో రోజకు ఒక టన్ను చేపలను తీయవచ్చని ఆదిత్య తెలిపాడు. ఇక ఒక్కో చేప ఏడాదిలో సుమారుగా 1.50 కిలోల బరువు పెరుగుతుందని.. హైదరాబాద్ మార్కెట్‌లో వీటిని విక్రయించడంతోపాటు అమెరికాకు కూడా ఎగుమతి చేస్తామని తెలిపాడు. అయితే రెయిన్‌బో ట్రౌట్ చేపల పెంపకం పట్ల ప్రస్తుతం చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారని.. అందుకోసం తాను అలాంటి వారికి సహాయం చేస్తున్నానని తెలిపాడు. వారికి కావల్సిన చేప పిల్లలు లేదా గుడ్లు.. వాటి ఆహారం.. ఇతర సామగ్రిని తాను పంపిణీ చేస్తున్నానని వివరించాడు.
అయితే ఈ చేపలను పెంచేవారు అవి ఉండే నీటి ఉష్ణోగ్రతను 5 నుంచి 15 డిగ్రీల వద్ద మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని ఉంచాలి. వాటిని యూవీ ఫిల్టర్ చేయాలి. ఇలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటేనే చేపలు సులభంగా పెరుగుతాయి. అయితే ఒకేసారి భారీ ఎత్తున కాకుండా కొద్ది కొద్దిగా ఈ చేపలను పెంచడం కూడా ప్రారంభించవచ్చు. దీంతో ఈ వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయని ఆదిత్య చెబుతున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…