Faria Abdhullah : చిట్టి ఏంది.. ఇంతగా రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది..!

November 14, 2021 10:59 AM

Faria Abdhullah : న‌వీన్ పోలిశెట్టి హీరోగా తెర‌కెక్కిన జాతి ర‌త్నాలు సినిమాలో చిట్టి అనే పాత్ర‌లో క‌నిపించిన అందాల ముద్దుగుమ్మ ఫ‌రియా అబ్ధుల్లా. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని కుర్రకారులో క్రేజీ బ్యూటీగా వెలిగిపోయింది. ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌క‌పోయినా కూడా సోషల్ మీడియాలో ప‌లు వీడియోలు షేర్ చేస్తూ భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో అభిమానులకు టచ్ లో ఉంటూ అప్ డేట్స్ ఇస్తున్న ఫరియా తాజాగా ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది.

Faria Abdhullah mesmerizing dance steps for bhimla nayak song

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన భీమ్లా నాయ‌క్ చిత్రంలోని ఊర‌మాస్ పాట లాలా భీమ్లాకు అదిరిపోయే స్టెప్పులు వేసింది ఫరియా. బ్లాక్ డ్రెస్‌లో మ‌తులు పోగొడుతూ చిందులు వేసిన ఈ ముద్దుగుమ్మ అంద‌రి మ‌న‌సులనూ దోచుకుంటోంది. ఫరియాకు డాన్సు అంటే చిన్ననాటి నుంచి పిచ్చి. ఇప్పటికే కొన్ని డాన్సు వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మ‌ధ్య ఫ‌రియా వేసిన తీన్మార్ డ్యాన్స్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్‏ను తన ఖాతాలో వేసుకున్న ఫ‌రియా చిట్టి పాత్రలో మెప్పించింది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్ధుల్లా తమ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ సినిమాతోనే తెలుగులు ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది ఈ హైదరాబాద్ చిన్నది.

ఇక ప్రస్తుతం ఫరియాకు తెలుగులో ఆఫర్లు తక్కువగానే ఉన్నాయి. ఇటీవల మంచు విష్ణు ప్రధాన పాత్రలో రాబోతున్న ఢీ సిక్వెల్‏లో ఫరియా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

https://www.instagram.com/reel/CWNoA2ogHUV/?utm_source=ig_web_copy_link

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now