Samantha : ఆందోళనలో సమంత అభిమానులు.. ఇకపై అలాంటి సినిమాలు చూస్తామా..?

October 24, 2021 4:21 PM

Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సమంత.. అక్కినేని ఇంటిలో కోడలిగా అడుగుపెట్టడం నాలుగు సంవత్సరాల కాలంలోనే ఆ ఇంటితో తెగతెంపులు చేసుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

fans worrying about Samantha  that she may not do tollywood movies

విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన దృష్టిని మొత్తం బాలీవుడ్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలీవుడ్ కి సమంత వెళితే ఇక తెలుగులో సమంత సినిమాలు చేయదా.. తెలుగు తెరపై సమంతను చూడలేమా.. అంటూ అభిమానులు ఆందోళన పడుతూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

అయితే సమంత తెలుగులో మరెన్నో అద్భుతమైన చిత్రాలలో నటిస్తుందని, ఇప్పటికే తాను తెలుగు సినిమా కథలను వింటుందని కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మాత్రమే కాకుండా కమర్షియల్ చిత్రాల్లో కూడా నటించడానికి సమంత సిద్ధంగా ఉందని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా సమంత దసరా పండుగ రోజు రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment