F3 Movie : అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2కు సీక్వెల్‌గా వచ్చిన ఎఫ్3 మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ మూవీ తెగ నచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఘన విజయం సాధించింది. కామెడీ ప్రధానాంశంగా ఈ మూవీని తెరకెక్కించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో కొన్ని సిల్లీ కామెడీ సీన్లు ఉన్నాయి. అయినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే.. ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. కనుకనే సినిమాకు ఆదరణ లభిస్తోంది. అయితే ఈ మూవీ ఏమోగానీ ఇప్పుడు పలువురు హీరోలకు చెందిన ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధమే కొనసాగుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఎఫ్3 మూవీ క్లైమాక్స్ సీన్లలో ప్రభాస్ బాహుబలి, పవన్ వకీల్ సాబ్, గబ్బర్ సింగ్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, ఎన్‌టీఆర్ అరవింద సమేత, రామ్ చరణ్ రంగస్థలం, ఆర్ఆర్ఆర్, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, పుష్ప సినిమాల్లోని పాత్రలను చూపించారు. అయితే తమ హీరోలను ఇలా చూపించడం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దీంతో వెంకటేష్, వరుణ్ తేజ్ లను ఆయా హీరోలకు చెందిన ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తూ మీమ్స్ చేస్తున్నారు.
ఇక వరుణ్ తేజ్ కాసేపు పవన్ వకీల్ సాబ్‌లా కనిపించాడు. అయితే వరుణ్ కామెడీగా చేసినందున పవన్ ఫ్యాన్స్ ఆయనకు అవమానం జరిగిందని ఫీలవుతున్నారు. దీంతో వరుణ్ తేజ్‌ను వారు ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. అయితే మొత్తానికి దర్శకుడు అనిల్ రావిపూడి అనుకున్నట్లుగానే ఈ మూవీకి నెగెటివ్ పబ్లిసిటీ జరుగుతోంది. మరి ఇది ప్రేక్షకులను థియేటర్లకు ఎక్కువ మొత్తంలో రప్పిస్తుందా.. ఎఫ్3 మూవీ మొత్తంగా ఎంత వసూలు చేస్తుంది.. అన్న వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. కానీ అలా పలువురు హీరోలకు చెందిన పాత్రలను కామెడీగా చూపించడంతో ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒక హీరో ఫ్యాన్స్ పై మరొకరు విమర్శలు చేస్తున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…